Hansika | తెలుగు,తమిళ,హిందీ భాషల్లో.. హన్సిక ‘మై నేమ్ ఈజ్ శృతి’
నటనా ప్రధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటూ తన కంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంటున్న నటి హన్సిక. దేశముదురు సినిమాతో సినీరంగంలోకి ప్రవేశించిన హన్సిక దాదాపు దశాబ్ద కాలం పాటు సక్సెస్ ఫుల్ హీరోయిన్గా కొనసాగుతుంది
Hansika | నటనా ప్రధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటూ తన కంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంటున్న నటి హన్సిక. ‘దేశముదురు’ సినిమాతో సినీరంగంలోకి ప్రవేశించిన హన్సిక దాదాపు దశాబ్ద కాలం పాటు సక్సెస్ ఫుల్ హీరోయిన్గా కొనసాగుతుంది. ప్రస్తుతం ఈమె వరుసగా సినిమాలను చేస్తూ నవతరం కథానాయికలకు పోటీనిస్తుంది. ప్రస్తుతం ఈమె చేతిలో అరడజనుకు పైగా సినిమాలనున్నాయి. ఈమె ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ మై నేమ్ ఈజ్ శృతి’. శ్రీనివాస్ ఓంకార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవల తెలుగులో విడుదలైన టీజర్ ప్రేక్షకులను అలరిస్తుంది. తాజాగా ఈ చిత్ర హిందీ, తమిళ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
మేకర్స్ విడుదల చేసిన ట్రైలర్ ఆధ్యంతం ఆకట్టుకుంటుంది. ఆర్గాన్ మాఫియా నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని వైష్ణవి ఆర్ట్స్ పతాకంపై బురుగు రమ్య ప్రభాకర్ నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో నిర్మాత మాట్లాడుతూ ‘తెలుగులో విడుదల చేసిన టీజర్‌కు వచ్చిన స్పందన అనూహ్యం. టీజర్ ఆద్యంతం ఆసక్తిగా వుండటంతో సినిమాపై మంచి క్రేజ్ ఏర్పడింది. వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో, ప్రతి సన్నివేశాన్ని ఎంతో ఆసక్తికరంగా దర్శకుడు మలిచాడు. తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం అన్నారు.’ దర్శకుడు మాట్లాడుతూ ‘సినిమా చూస్తున్నంత సేపు తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠ.. ముగింపు వరకు ఎవరూ ఊహించలేని ట్విస్ట్‌లతో వుంటుంది’ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

