Nindha | కొత్త బంగారు లోకం, హ్యాపీ డేస్ సినిమాలతో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు వరుణ్ సందేశ్ (Varun Sandesh). మిస్టరీ థ్రిల్లర్ జోనర్లో వరుణ్ సందేశ్ లీడ్ రోల్ పోషించిన చిత్రం నింద (Nindha). క్రైం థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిన ఈ చిత్రానికి రాజేశ్ జగన్నాథం దర్శకత్వం వహించాడు. కాండ్రకోట మిస్టరీ క్యాప్షన్‌తో వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కింది.
ది ఫెర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కించిన ఈ చిత్రం జూన్ 21న థియేటర్లలో విడుదల కాగా మిక్స్డ్ రెస్పాన్స్ రాబట్టుకుంది. కాగా ఇప్పుడిక ఓటీటీలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయింది. నింద పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం ఈటీవీ విన్లో సెప్టెంబర్ 6న ప్రీమియర్ కానుంది. మరి ఓటీటీలో ఎలాంటి స్పందన తెచ్చుకుంటుందనేది చూడాలంటున్నారు సినీ జనాలు.
నిందలో తనికెళ్ల భరణి, భద్రమ్, చత్రపతి శేఖర్, సిద్ధార్థ్ గొల్లపూడి, శ్రేయా రాణిరెడ్డి, అన్నీ, క్యూ. మధు, సూర్య, అరుణ్ దలై, మైమ్ మధు కీలక పాత్రల్లో నటించారు.
After successful run in theatres, the intriguing thriller #Nindha is all set for its premiere on @Etvwin from September 6th#AKandrakotaMystery#NindhaFromJune21 @itsvarunsandesh @tanikellabharni @actorbhadram #Suryakumar #Chatrapathisekhar @rajesh_tweetss @tharan_tandle… pic.twitter.com/ybhOKPXFQQ
— BA Raju’s Team (@baraju_SuperHit) September 4, 2024
Thandel | జోష్ టు తండేల్.. నాగచైతన్య జర్నీకి ఎన్నేండ్లో తెలుసా..?
Samantha | మూవీ షూటింగ్లో గాయపడ్డ సమంత..! గాయాలు కాకుండా యాక్షన్ స్టార్‌ను కాగలనా? అంటూ పోస్ట్..!