శనివారం 27 ఫిబ్రవరి 2021
Cinema - Jan 23, 2021 , 00:09:37

వరుడి ఆగమనం

వరుడి ఆగమనం

నాగశౌర్య, రీతూవర్మ జంటగా నటిస్తున్న చిత్రం ‘వరుడు కావలెను’. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. లక్ష్మీసౌజన్య దర్శకురాలు. శుక్రవారం నాగశౌర్య జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన పాత్ర  టీజర్‌ను చిత్రబృందం విడుదలచేసింది. ఈ వీడియోలో  మోడ్రన్‌ లుక్‌లో ైస్టెలిష్‌గా నాగశౌర్య కనిపిస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘పెళ్లి బంధంలోని ఔన్యత్యాన్ని చాటే చిత్రమిది. చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుతున్నాం. మే నెలలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’ అని తెలిపారు.  

పడిలేచిన వాడితో పందెం

‘చాలా మందికి ఆటతో గుర్తింపు వస్తుంది. కానీ ఆటకే గుర్తింపు తెచ్చేవాడు ఎవరో ఒకరు పుడతాడు. అలాంటి వాడి కథే ఈ సినిమా’ అని అంటున్నారు నాగశౌర్య. ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం ‘లక్ష్య’. నారాయణదాస్‌ నారంగ్‌, పుస్కూర్‌ రామ్‌మోహన్‌రావు, శరత్‌మరార్‌ నిర్మాతలు.  సంతోష్‌ జాగర్లపూడి దర్శకుడు. కేతికా శర్మ కథానాయిక. నాగశౌర్య జన్మదినం సందర్భంగా చిత్ర టీజర్‌ను శుక్రవారం విడుదలచేశారు. జగపతిబాబు వాయిస్‌ ఓవర్‌తో ఆసక్తికరంగా టీజర్‌ ప్రారంభమైంది. ‘పడిలేచిన వాడితో పందెం ప్రమాదకరం’ అనే డైలాగ్‌ ఉద్వేగాన్ని పంచుతోంది.  ప్రాచీన విలువిద్య నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రస్తుతం చివరి షెడ్యూల్‌ చిత్రీకరణ జరుగుతోంది. 

VIDEOS

logo