వరలక్ష్మి శరత్‌కుమార్ తన కెరీర్లో మరో అడుగు ముందుకేశారు. స్వీయ దర్శకత్వంలో తన సోదరి పూజా శరత్‌కుమార్‌తో కలిసి ఆమె ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమా పేరు ‘సరస్వతి’. శనివారం ఈ సినిమా టైటిల్ పోస్టర్ని విడుదల చేశారు.
హై కాన్సెప్ట్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్‌కుమార్ పాత్ర ఊహలకు అందని విధంగా ఉంటుందని, ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తామని మేకర్స్ తెలిపారు. ప్రకాశ్‌రాజ్, ప్రియమణి, నవీన్‌చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: తమన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ప్రవీణ్ డేనియల్, నిర్మాణం: దోస డైరీస్.