Valentines Day | బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌కి చెందిన పలువురు సెలబ్రిటీ జంటలు నేడు వాలంటైన్స్ వేడుకను జరుపుకుంటున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు తన ప్రేయాసి, ప్రియుడితో కలిసి ప్రేమికుల రోజును జరుపుకోవడానికి వేకేషన్లకు చేక్కేశారు. అయితే ఈ వాలంటైన్లో మీకు ఇష్టమైన వారితో ఉండి గడపాలి అనుకుంటున్నారా. అయితే మంచి లవ్ స్టోరీ ఉన్న మూవీస్ చూడండి. ఇప్పటివరకు ఇండియాలో వచ్చిన బెస్ట్ వాలంటైన్ సినిమాలు ఏంటి అనేది ఒకసారి చూసుకుంటే..
1. ప్రేమికుల రోజు
యువ నటుడు కునాల్, సోనాలి బింద్రే ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ప్రేమికుల రోజు(). ఈ సినిమా కథ పరంగానే కాకుండా మ్యూజిక్ పరంగా అప్పట్లో ఒక ఊపు ఊపింది. ఈ సినిమాలోని పాటలు ఇప్పటికి యూత్‌ను ఉర్రూతలూగిస్తూనే ఉన్నాయి. కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు చూసిన కొత్త అనుభుతినిస్తుంది.
2. వీర్ – జారా
ఇండియా – పాకిస్థాన్ అనగానే మనకు వెంటనే గుర్తోచ్చేది ఇరుదేశాల మధ్య శత్రుత్వం. ఇంకో 50 ఏండ్లు అయిన ఇది ఇలానే కోనసాగేలా ఉంది. అయితే ఈ రెండు దేశాల మధ్య ఒక లవ్‌స్టోరీని తెరకెక్కించి చరిత్రలో నిలిచిపోయాడు బాలీవుడ్ దర్శకుడు యష్ చోప్రా. యష్ చోప్రా దర్శకత్వంలో వచ్చిన చిత్రం వీర్ – జారా(Veer Zaara). బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, ప్రీతీ జింటా జంటగా నటించిన ఈ చిత్రం 2004లో విడుదలై కల్ట్ క్లాసిక్‌గా నిలవడమే కాకుండా ఈ సినిమా వలన రెండు దేశాల మధ్య రిలేషన్స్ కూడా మెరుగయ్యాయి. లవ్ స్టోరీ బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చి 2004లో ఎక్కువ ప్రేక్షకాఆదరణ పొందిన చిత్రంగా నిలిచింది.
3. గీతాంజలి
అక్కినేని నాగార్జున, గిరిజా షెట్టర్ జంటగా మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన చిత్రం గీతాంజలి. నాగార్జున కెరీర్లో మైలురాయిగా నిలవడమే కాకుండా ఇళయారాజ అందించిన సంగీతం ఇప్పటికి ప్రతిచోటా వినిపిస్తుంటుంది.
4. రోజా
మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన మరో ప్రేమకథా చిత్రం రోజా. కాశ్మీర్ టెర్రరిజం, లవ్ నేపథ్యంలో ఈ సినిమా రాగా.. సూపర్ హిట్‌గా నిలిచింది ఈ చిత్రం. ఈ సినిమాతోనే సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు.
5. సఖి
మణిరత్నం రూపొందించిన మరో ప్రేమ కావ్యం ‘సఖిస. ఇందులో మాధవన్, శాలిని హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రానికి సంగీతాన్ని ఏఆర్ రెహమాన్ అందించారు. ఈ సినిమా పాటలు కూడా చాట్ బస్టర్ గా నిలిచిపోయాయి.
6. డీడీఎల్జే
షారుఖ్ ఖాన్ – కాజోల్ నటించిన ఆల్ టైం బ్లాక్ బస్టర్ చిత్రం దిల్వాలే దుల్హనియా లే జాయేంగే. ఆదిత్య చోప్రా దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలవడమే కాకుండా ఇందులోని పాటలు చార్ట్ బస్టర్‌గా నిలిచాయి. మరోవైపు ఈ సినిమా గత 30 ఏండ్లుగా ముంబైలోని మరాఠ మందిర్ అనే థియేటర్లో రన్ అవుతుంది.
7. తొలి ప్రేమ
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, కీర్తి రెడ్డి హీరో హీరోయిన్లుగా నటించిన మూవీ ‘తొలిప్రేమ’. ఈ సినిమా కూడా లవర్స్‌ను బాగా ఆకట్టుకుంది.
8. సీతారామం
దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ నటించిన లవ్ బ్యాక్ డ్రాప్ మూవీ ‘సీతారామం’. హను రాఘవపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.
ఇంకా ఇవే కాకుండా రామ్ చరణ్ నటించిన ఆరెంజ్, సూర్య నటించిన గజిని, నువ్వు నేను ప్రేమ, సూర్య సన్ ఆఫ్ కృష్ణన్, అజిత్ . ప్రియురాలు పిలిచింది, నాగ చైతన్య ఏ మాయ చేశావే, దుల్కర్ సీతారామం, షాహిద్ కపూర్ జబ్ వీ మెట్, 96, తదితర సినిమాలు ఉన్నాయి.