అంజలికి కరోనా .. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్
అంజలికి కరోనా | అల్లు అరవింద్, త్రివిక్రమ్ శ్రీనివాస్, నివేదా థామస్ ఇలా చాలామంది రెండోదశ మొదలైన తర్వాత ఈ వైరస్ బారిన పడ్డారు. ఇప్పుడు అంజలికి కరోనా

కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ నడుస్తుంది. మనదేశంలో ఈ వైరస్ ఉద్ధృతి మరింత వేగంగా ఉంది. ప్రతి రోజూ లక్షా పాతిక వేల కేసులు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో కరోనా కేసులు దారుణంగా పెరిగిపోతున్నాయి. ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు ఈ వైరస్ బారిన పడ్డారు. తెలుగు ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో అల్లు అరవింద్, త్రివిక్రమ్ శ్రీనివాస్, నివేదా థామస్ ఇలా చాలామంది రెండోదశ మొదలైన తర్వాత ఈ వైరస్ బారిన పడ్డారు. ఈ క్రమంలో ఇప్పుడు హీరోయిన్ అంజలికి కరోనా వచ్చిందంటూ సోషల్ మీడియాలో వార్తలు మొదలయ్యాయి.

దానిపై అంజలి కూడా ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడంతో అంతా ఇది నిజమే అనుకున్నారు. పైగా వకీల్ సాబ్ సినిమాలో ఈమెతో పాటు కలిసి నటించిన నివేదా థామస్ కు ఈ మధ్య కరోనా వచ్చింది. దానికి తోడు ఇద్దరూ కలిసి ప్రమోషన్ కూడా చేశారు. దాంతో అంజలికి కరోనా సోకి ఉంటుందని అంతా అనుకున్నారు. ఈ వార్తలు ఇప్పుడు ఎక్కువైపోవడంతో తన సోషల్ మీడియా పేజీలో దీని గురించి కామెంట్ చేసింది అంజలి. ఈ విషయంపై ఒక లెటర్ విడుదల చేసింది.
— Anjali (@yoursanjali) April 8, 2021
‘అందరికీ నమస్కారాలు.. నాకు కోవిడ్ వచ్చింది అంటూ చాలా మీడియా మాధ్యమాలలో వార్తలు వచ్చాయి. అయితే అందులో ఎలాంటి నిజం లేదు. నాకు వైరస్ సోకలేదు’ అని చెప్పుకొచ్చింది. ఇదంతా తప్పుడు వార్తలు అని కొట్టేసింది అంజలి. తాను చాలా ఆరోగ్యంగా ఉన్నానని ఇలాంటి వార్తలు నమ్మొద్దని అంటూ అభిమానులను కోరింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి
వకీల్ సాబ్ ప్రివ్యూ చూడటానికి 5 కారణాలు
చెడ్డీలోనే పెండ్లికొడుకు..షాకైన జనం
బాలీవుడ్ నటి జాన్వి కపూర్ లేటెస్ట్ ఫోటోలు
Actress Vishnupriya లేటెస్ట్ ఫోటోలు
‘పుష్ప’ రిలీజ్ అన్ని నెలలు వాయిదా పడబోతుందా.
ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్‌పై రాజమౌళి క్లారిటీ
అమెజాన్ ప్రైమ్‌లో జాతిరత్నాలు .. ఎప్పుడంటే..?
కమల్‌హాసన్ సినిమాలో ఫహద్ ఫాసిల్..!
విజయ్ సైకిల్ పై వెళ్లడానికి కారణమిదే..!
పూజాహెగ్డే డిఫరెంట్ గ్లామర్ షేడ్స్..వీడియో వైరల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rajeev Kanakala | ఎన్టీఆర్ అప్పుడే స్టార్ అవుతాడని చెప్పా, 25 ఏళ్లు గడిచినా మారలేదు.. రాజీవ్ కనకాల ఆసక్తికర వ్యాఖ్యలు!
Dakshinamukhi Anjaneya Swamy | పార్డి (కె) గ్రామంలో ముగిసిన అఖండ హరినామ తాళ సప్తహ వేడుకలు
Mokshagna | మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై క్రేజీ అప్డేట్.. దర్శకత్వ బాధ్యతలు వశిష్ఠకే, జనవరి చివరి నుంచి షూటింగ్..
Firecrackers History | దీపావళికి బాణసంచా ఎలా వచ్చింది? చైనా నుంచి భారత్‌కు టపాసుల ప్రయాణం ఇదే!
Scene | బాక్సాఫీస్ వద్ద సూర్య ‘సీన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లో 11.5 లక్షలకు పైగా టికెట్లు!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

