కొండ పొలం బిజినెస్ అదుర్స్.. ట్రైలర్‌తో పెరిగిపోయిన అంచనాలు..

కొన్ని సినిమాల విషయంలో అలాగే జరుగుతుంది. అప్పటి వరకు వాటిపై ఎలాంటి అంచనాలు లేకపోయినా కూడా ఒక్క టీజర్ కానీ.. ట్రైలర్ కానీ వచ్చిందంటే బిజినెస్‌కు రెక్కలొస్తుంటాయి. ఇప్పుడు వైష్ణవ్ తేజ్ కొండ పొలం సినిమా విషయంలోనూ ఇదే జరుగుతుంది. ఉప్పెన సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి సంచలన ఎంట్రీ ఇచ్చాడు మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్. ఒక మెగా హీరో ఎలాంటి డెబ్యూ ఇవ్వాలని కలలు కంటాడో.. అలాంటి మొదటి సినిమా వైష్ణవ్‌కు పడింది. ఏకంగా 50 కోట్లకు పైగా వసూలు చేసి ఈ సినిమాతో సంచలనం సృష్టించాడు వైష్ణవ్ తేజ్. దాంతో మొదటి సినిమాతోనే వైష్ణవ్ తేజ్ హాట్ కేక్ అయిపోయాడు. ఈయన కోసం ఇప్పుడు చాలా మంది దర్శకులు క్యూ కట్టారు.

ఇదిలా ఉంటే ఈయన నటించిన రెండో సినిమాను నేరుగా ఆన్ లైన్లో విడుదల చేస్తున్నట్లు కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఉప్పెన విడుదలకు ముందే క్రిష్ దర్శకత్వంలో రెండో సినిమా కొండ పొలం పూర్తి చేశాడు వైష్ణవ్. కొండ పొలం నవల ఆధారంగా క్రిష్ ఈ సినిమాను తెరకెక్కించాడు. కేవలం 45 రోజుల్లోనే మొత్తం నల్లమల అటవీ ప్రాంతంలో షూటింగ్ పూర్తి చేశాడు. దీనికి కొండ పొలం టైటిల్ కన్ఫామ్ చేసి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. నిజం చెప్పాలంటే ట్రైలర్ విడుదలయ్యే ముందు వరకు ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేవు. పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లు తెరకెక్కిస్తూనే.. షూటింగ్ గ్యాప్‌లో ఈ సినిమాను పూర్తి చేశాడు క్రిష్.

చాలా తక్కువ బడ్జెట్‌తోనే ఈ సినిమా తెరకెక్కింది. రకుల్ ప్రీత్ సింగ్ ఇందులో హీరోయిన్. పూర్తిగా డీ గ్లామర్ పాత్రలో రకుల్ నటిస్తోంది. దాంతో కచ్చితంగా ఈ సినిమా థియేటర్లో కాకుండా డిజిటల్లోనే విడుదల చేస్తారని అందరూ ఫిక్స్ అయిపోయారు. ఇలాంటి సమయంలో విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. మరీ ముఖ్యంగా ట్రైలర్ అయితే యూ ట్యూబ్‌లో ట్రెండ్ అవుతుంది. ఇప్పటికే 70 లక్షల వ్యూస్ సాధించింది కొండ పొలం ట్రైలర్. అక్టోబర్ 8న విడుదల కానుంది ఈ చిత్రం. కేవలం ట్రైలర్‌తోనే బిజినెస్ కూడా జరుగుతుంది. ఈ సినిమాకు 20 కోట్లకు పైగానే బిజినెస్ జరుగుతుందని తెలుస్తోంది. మరి మెగా మేనల్లుడు కొండ పొలం సినిమాతో ఏమాయ చేస్తాడో చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒంటరి అవుతున్నాడా..?
Dil Raju | సినీ పరిశ్రమను వివాదాల్లోకి లాగొద్దు: దిల్ రాజు
‘మా’ రాజకీయ వేదిక కాదు.. ప్రకాశ్ రాజ్‌పై నరేశ్ ఫైర్
ఆ ముద్దు సన్నివేశం గురించి సాయిపల్లవి ఏమన్నదంటే..?
ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్న హీరోయిన్లు వీళ్లే..
మోహన్ బాబును దొంగ నా కొడుకు అని తిట్టిన స్టార్ హీరో ఎవరు..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

