టాలీవుడ్ యువ హీరో అఖిల్ అక్కినేని (Akhil Akkineni) నటిస్తోన్న యాక్షన్ ఎంటర్టైనర్ ఏజెంట్ (Agent). సురేందర్ రెడ్డి (Surenderreddy) దర్శకత్వం వహిస్తున్నాడు. ఏజెంట్ ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా ప్రధాన భారతీయ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. కాగా ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది.
ఏజెంట్లో ఐటెం సాంగ్ ఉండగా.. ఈ పాట కోసం బాలీవుడ్ డ్యాన్సింగ్ క్వీన్ ఊర్వశి రౌటేలాను మేకర్స్ సంప్రదించారని, దీనిపై అధికారిక ప్రకటన రావడమే ఆలస్యమని ఓ వార్త ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. ఊర్వశి ఇప్పటికే వాల్తేరు వీరయ్యలో చిరంజీవితో కలిసి బాస్ పార్టీ సాంగ్‌లో మెస్మరైజింగ్ డ్యాన్స్ తో బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. మరి కొత్త అప్డేట్ నిజమైతే ఈ సారి ఊర్వశి రౌటేలా ఎలాంటి సాంగ్‌తో అదరగొట్టబోతుందనేది చూడాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు సినీ జనాలు.
ఇప్పటికే విడుదల చేసిన ఏజెంట్ టీజర్, పాటలకు మంచి స్పందన వస్తోంది. వక్కంతం వంశీ ఈ చిత్రానికి కథనందిస్తున్నారు. ఏజెంట్ సినిమాతో మోడల్ సాక్షి వైద్య (Sakshi vaidya) సిల్వర్ స్క్రీన్‌పై హీరోయిన్గా తొలిసారి మెరువబోతుంది. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఏజెంట్లో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తుండగా.. మురళీ శర్మ, పోసాని కృష్ణమురళి ఇతర కీ రోల్స్ పోషిస్తున్నారు.
మళ్లీ మళ్లీ నువ్వే సాంగ్ లిరికల్ వీడియో..
ఏజెంట్ టీజర్..
Thiruveer | మసూద హీరో తిరువీర్ పీరియాడిక్ సినిమా.. వివరాలివే
Project K | ప్రభాస్ ప్రాజెక్ట్ Kలో విలన్ ఆర్మీ రైడర్స్ ఎలా ఉండబోతున్నారంటే..?
Vakeel Saab 2 | వకీల్‌సాబ్ 2 ఆన్ ది వే.. క్రేజీ న్యూస్‌తో అభిమానులు ఖుషీ!