Project K | ప్రభాస్ (Prabhas) నటిస్తోన్న పాన్ ఇండియా సినిమాల్లో ఒకటి ప్రాజెక్ట్ K (project k). నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్ జోనర్లో తెరకెక్కుతుంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే (Deepika Padukone), దిశా పటానీ, ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తుండగా.. అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.
ప్రాజెక్ట్ Kలో కీలకంగా సాగే రైడర్స్ (యూనిఫార్మ్డ్ విలన్ ఆర్మీ) కాస్ట్యూమ్స్ మేకింగ్, అసెంబ్లింగ్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. కాస్టూమ్ డిజైనర్ అర్చనా రావు, నితిన్ జిహాని అండ్ టీం మెంబర్స్ కలిసి రైడర్స్ ఉత్తమ లుక్‌లో కనిపించేలా డిజైనింగ్ వర్క్ కోసం చాలా కష్టపడ్డట్టు ఈ వీడియోతో తెలిసిపోతుంది. అంతేకాదు ఈ సినిమాలో ఆర్మీ ఎలాంటి ఆయుధాలు వాడారో కూడా ఈ వీడియో ద్వారా తెలిసిపోతుంది. మొత్తానికి తాజా వీడియోతో ప్రాజెక్ట్ K పై అంచనాలు అమాంతం పెంచేస్తున్నాడు నాగ్ అశ్విన్.
ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ప్రాజెక్ట్ K 2024 జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ప్రాజెక్ట్ K రూ.500 కోట్లకుపైగా బడ్జెట్‌తో తెరకెక్కుతున్నట్టు ఇన్సైడ్ టాక్. ప్రభాస్ దీంతోపాటు ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ సలార్ సినిమాలో నటిస్తున్నాడు. మారుతి దర్శకత్వంలో హార్రర్ కామెడీ మూవీ, ఓం రౌత్ దర్శకత్వంలో మైథలాజికల్ డ్రామా ఆదిపురుష్‌లో కూడా నటిస్తున్నాడు.
రైడర్స్ సిద్దమవుతున్నారిలా..
హాలీవుడ్ రేంజ్లో దీపికాపదుకొనే లుక్..
Here's wishing our @deepikapadukone a very Happy Birthday.#ProjectK #HBDDeepikaPadukone pic.twitter.com/XfCbKapf25
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) January 5, 2023