Vakeel Saab 2 | వకీల్‌సాబ్ 2 ఆన్ ది వే.. క్రేజీ న్యూస్‌తో అభిమానులు ఖుషీ!
Vakeel Saab 2 | కోర్టు రూం డ్రామా నేపథ్యంలో సాగే కథతో తెరకెక్కిన వకీల్ సాబ్ (Vakeel Saab) ఏప్రిల్ 9 (ఆదివారం)తో విజయవంతంగా రెండేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా అభిమానులు ట్విట్టర్లో చిట్‌చాట్ సెషన్ పెట్టారు. ఈ సెషన్లో డైరెక్టర్ వేణుశ్రీరామ్ (Venu Sriram) కూడా పాల్గొన్నాడు.
Vakeel Saab 2 |టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) టైటిల్ రోల్లో నటించిన చిత్రం వకీల్ సాబ్ (Vakeel Saab). కోర్టు రూం డ్రామా నేపథ్యంలో సాగే కథతో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 9 (ఆదివారం)తో విజయవంతంగా రెండేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా అభిమానులు ట్విట్టర్లో చిట్‌చాట్ సెషన్ పెట్టారు. ఈ సెషన్లో డైరెక్టర్ వేణుశ్రీరామ్ (Venu Sriram) కూడా పాల్గొన్నాడు.
చిట్‌చాట్ సెషన్లో వకీల్‌సాబ్ తప్పకుండా రీరిలీజ్ అవుతుందన్నాడు వేణుశ్రీరామ్. అంతేకాదు వకీల్‌సాబ్ 2 (Vakeel Saab 2) కూడా ఉండబోతుందని సర్ప్రైజ్ వార్త అందించాడు. ప్రస్తుతం వకీల్‌సాబ్ 2 స్క్రిప్ట్ వర్క్ కొనసాగుతుందని చెప్పాడు. ఈ అప్డేట్ తెలుసుకున్న అభిమానులు పవన్ కల్యాణ్ కాంపౌండ్ నుంచి మరో బ్లాక్ బాస్టర్ రాబోతుందని ఎగిరిగంతేస్తున్నారు.
వేణుశ్రీరామ్ దర్శకత్వం వహించిన వకీల్‌సాబ్‌లో శృతిహాసన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటించింది. అంజలి, నివేదా థామస్, అనన్య నాగళ్ల కీలక పాత్రల్లో నటించారు. ఈ ముగ్గురి చుట్టూ తిరిగే కథాంశంతో చివరి వరకు రక్తికట్టించేలా సాగే వకీల్‌సాబ్‌కు తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన వకీల్‌సాబ్‌కు సీక్వెల్ రాబోతుందన్న వార్త ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.
పవన్ కల్యాణ్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో తీరిక లేకుండా ఉన్నాడు. క్రిష్ దర్శకత్వంలో హరిహరవీరమల్లు, సుజిత్ దర్శకత్వంలో ఓజీ, సముద్రఖని డైరెక్షన్లో వినోదయ సీతమ్ రీమేక్, హరీష్ శంకర్ డైరెక్షన్లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల్లో నటిస్తున్నాడు పవన్ కల్యాణ్. మరి ఇంత బిజీ షెడ్యూల్లో పవన్ కల్యాణ్ వకీల్‌సాబ్ 2కు డేట్స్ కేటాయించడం సాధ్యమవుతుందా..? ఇంతకీ ఈ క్రేజీ సీక్వెల్ ఎప్పుడు తెరపైకి వస్తుందనేది ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

