Jani Master | లైంగిక వేధింపుల కేసులో (sexual assault case) ప్రముఖ కొరియోగ్రఫర్ జానీ మాస్టర్ (Jani Master)కు ఉప్పరపల్లి కోర్టు (Upparpally court) షాకిచ్చింది. 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. అక్టోబర్ 3 వరకు రిమాండ్‌లో ఉంచాలని ఆదేశించింది.
జానీ మాస్టర్ ఓ డ్యాన్సర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడిన వివాదం సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఈ వివాదంలో జానీ మాస్టర్‌పై ఐపీసీ సెక్షన్ 376, 506, 323(2)తోపాటు పోక్సో కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో గోవాలో జానీ మాస్టర్‌ను అదుపులోకి తీసుకున్న సైబరాబాద్ పోలీసుల బృందం హైదరాబాద్‌కు తీసుకొచ్చారు.
అనంతరం రాజేంద్రనగర్ సీసీఎస్ కార్యాలయంలో సీక్రెట్‌గా విచారించిన అనంతరం జానీ మాస్టర్‌ను ఉప్పరపల్లి కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా కోర్టు జానీ మాస్టర్‌కు 14 రోజుల రిమాండ్ విధించింది. కోర్టు తీర్పుతో అక్టోబర్ 3 వరకూ కొరియోగ్రఫర్ రిమాండ్‌లోనే ఉండనున్నారు. ఆయన్ని పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించారు. మరోవైపు ఆయన బెయిల్ కోసం రంగారెడ్డి కోర్టును ఆశ్రయించినట్లు తెలిసింది.
పోలీసుల విచారణలో జానీ మాస్టర్ సంచలన విషయాలు చెప్పినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా జానీ మాస్టర్ మాట్లాడుతూ.. నేను ఎలాంటి లైంగిక వేధింపులకు పాల్పడలేదు. కావాలనే కొందరు నాపై ఫిర్యాదు చేయించారు. న్యాయపరంగా పోరాడి నిజాయితీగా బయటకు వస్తా. నన్ను ఇరికించినవాళ్లను వదిలిపెట్టనని హెచ్చరించాడు.
నార్సింగి పోలీసులు ఈ కేసు విచారణలో భాగంగా ఇప్పటికే బాధితురాలి వాంగ్మూలం తీసుకున్నారు. బాధితురాలి ఇంట్లోనే విచారించిన పోలీసులు వివరాలు సేకరించారు. అనంతరం బాధితురాలికి వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. జానీ మాస్టర్ నాపై అత్యాచారం చేసి దాడి చేశాడు. షూటింగ్ టైంలో క్యారవాన్‌లో బలవంతం చేశాడు. సెక్స్ కోరిక తీర్చమని నన్ను ఎంతో వేధించాడు. తన మాట వినకపోతే ఆఫర్లు రాకుండా చేస్తానని బెదిరించాడు. పెళ్లి చేసుకోవాలని జానీ మాస్టర్ తనపై ఒత్తిడి చేశాడని బాధితురాలు తన స్టేట్మెంట్లో పేర్కొంది.
Also Read..
Shama Sikander | యాడ్ షూట్లో ఓ సూపర్ స్టార్ అభ్యంతరకరంగా తాకాడు : నటి షమ సికిందర్
Star Health Insurances | స్టార్ హెల్త్ కస్టమర్ల ప్రైవేట్ డేటా లీక్.. టెలిగ్రామ్‌లో అమ్మకానికి