Supreme Court | దేశంలో సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి. తాజాగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) యూట్యూబ్ ఛానల్ శుక్రవారం హ్యాక్‌కు (YouTube Channel Hacked) గురైంది. యూట్యూబ్ ఛానల్‌ను హ్యాక్ చేసిన నేరగాళ్లు.. అందులో క్రిప్టో కరెన్సీని (cryptocurrency) ప్రమోట్ చేస్తున్నట్లుగా ఉన్న వీడియోలను పోస్టు చేశారు.
సాధారణంగా ఈ యూట్యూబ్ ఛానల్‌ను సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారించే వాటితో పాటు కొన్ని కీలక కేసులను ప్రత్యక్ష ప్రసారం చేయడానికి ఉపయోగిస్తారు. అయితే ఆ వీడియోలకు బదులుగా అందులో ప్రస్తుతం అమెరికాకు చెందిన (US-based company) రిపిల్ ల్యాబ్స్ (Ripple Labs) అభివృద్ధి చేసిన క్రిప్టో కరెన్సీ ఎక్స్ఆర్పీని ప్రచారం చేసే వీడియోలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్స్‌ను పలువురు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో అప్రమత్తమైన సుప్రీంకోర్టు ఐటీ విభాగం చర్యలు చేపట్టింది.
Supreme Court of India’s YouTube channel appears to be hacked and is currently showing videos of US-based company Ripple. pic.twitter.com/zuIMQ5GTFZ
— ANI (@ANI) September 20, 2024
Also Read..
Star Health Insurances | స్టార్ హెల్త్ కస్టమర్ల ప్రైవేట్ డేటా లీక్.. టెలిగ్రామ్‌లో అమ్మకానికి
Cyber Crime: పెను సవాల్‌గా మారుతున్న సైబర్ క్రైం : కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్