Upendra | తెలుగు ప్రేక్షకులకు ఇంట్రడక్షన్ అవసరం లేని యాక్టర్ శాండల్ వుడ్ స్టార్ ఉపేంద్ర. తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫ్యాన్ బేస్ ఉన్న ఉపేంద్ర ప్రస్తుతం రెండు క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తున్నాడు. వీటిలో ఒకటి తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తోన్న కూలీ.. కాగా మరో మూవీ రామ్ పోతినేని నటిస్తోన్న ఆంధ్ర కింగ్ తాలూకా. ఇదిలా ఉంటే ఉపేంద్రకు సంబంధించిన కొత్త వార్త ఒకటి నెట్టింట రౌండప్ చేస్తోంది. ఈ క్రేజీ యాక్టర్ తెలుగులో కొత్త సినిమాకు సంతకం చేశాడట.
ఉపేంద్ర టాలీవుడ్ డైరెక్టర్ జయశంకర్‌తో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఫిలింనగర్ సర్కిల్లో న్యూస్ ఒకటి చక్కర్లు కొడుతోంది. సంతోష్ శోభన్ హీరోగా నటించిన యూత్ ఫుల్ డ్రామా పేపర్ బాయ్ సినిమాను డైరెక్ట్ చేశాడు జయశంకర్. ఈ దర్శకుడు చెప్పిన స్క్రిప్ట్ ఇంప్రెస్ చేయడంతో ఉపేంద్ర వెంటనే సినిమా చేసేందుకు ఒకే చెప్పాడని ఇన్సైడ్ టాక్. ఈ చిత్రం ఏకంగా రూ.100 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కనుండగా.. పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతుందని సమాచారం.
మరి ఇదే నిజమైతే ప్రయోగాత్మక సినిమాలు చేయడంలో ఎప్పుడూ ముందుండే ఉపేంద్ర ఈ సారి ఎలాంటి కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడన్నది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దీనిపై రానున్న రోజుల్లో ఉపేంద్ర టీం ఎలాంటి స్పష్టత ఇస్తుందనేది చూడాలి.
Raashi Khanna | పవన్ సినిమాలో రాశీ ఖన్నా.. అధికారికంగా ప్రకటించిన మేకర్స్
Ravi Teja | ఇది కదా డెడికేషన్ అంటే.. తండ్రి చనిపోయిన రెండు రోజులకే షూటింగ్ స్పాట్‌కి..!
War 2 Trailer | ‘వార్ 2’ ట్రైలర్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్.. ఎప్పుడంటే.!