War 2 Trailer | ‘వార్ 2’ ట్రైలర్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్.. ఎప్పుడంటే.!
War 2 Trailer | బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్, టాలీవుడ్ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘వార్ 2’.
War 2 Trailer | బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్, టాలీవుడ్ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘వార్ 2’. యష్‌రాజ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై ఆదిత్యచోప్రా నిర్మిస్తున్నాడు. యాక్షన్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఆగస్టు 14న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గరపడటంతో మూవీ ప్రమోషన్స్ చిత్రయూనిట్ షురూ చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ట్రైలర్ అప్డేట్ను పంచుకున్నారు మేకర్స్. ఈ సినిమా ట్రైలర్‌ను జూలై 25న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు.
దాదాపు 2 నిమిషాల 39 సెకన్ల నిడివి గల ఈ ట్రైలర్‌కు ‘U/A’ (16+) సర్టిఫికేట్‌ను జారీ చేసింది CBFC. దీంతో ఈ మూవీ ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచడం ఖాయమని చిత్ర బృందం భావిస్తోంది. ఇది YRF స్పై యూనివర్స్‌లో ఆరో చిత్రం. హృతిక్ రోషన్ కబీర్‌గా తిరిగి రాగా, జూనియర్ ఎన్టీఆర్ ప్రతినాయకుడి పాత్రలో బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. కియారా అద్వానీ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు.
ANNOUNCEMENT🚨: #WAR2 trailer out on July 25th.#War2 is set to release in Hindi, Telugu & Tamil on August 14th in cinemas worldwide! @iHrithik | @tarak9999 | @advani_kiara | #AyanMukerji | #YRFSpyUniverse pic.twitter.com/PmWtPQSuTC
— Yash Raj Films (@yrf) July 22, 2025
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

