Upasana Konidela | మెగా కోడలు ఉపాసన (Upasana Konidela) త్వరలో తల్లి కాబోతున్న విషయం తెలిసిందే. పెళ్లైన 10 ఏళ్ల తర్వాత ఉప్సీ గర్భందాల్చడంతో మెగా ఫ్యామిలీ సహా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బిడ్డ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఉపాసన సైతం తనకు పుట్టబోయే బిడ్డకోసం ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. ఈ నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది.
పుట్టబోయే బిడ్డ కార్డు బ్లడ్ (CordBlood)ను భద్రపరచనున్నట్లు వెల్లడించింది. భవిష్యత్తులో బేబీతోపాటు ఫ్యామిలీ ఆరోగ్యం కోసం అత్యాధునిక పద్ధతిలో స్టెమ్ సెల్ బ్యాంకింగ్ (StemCellBanking) విధానం ఎంచుకున్నట్లు పేర్కొంది. ఈ మేరకు ఈ విధానాన్ని వివరిస్తూ ఉప్సీ ఓ వీడియో సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది.
స్టెమ్ సెల్ బ్యాంకింగ్ అంటే.. బొడ్డు తాడు దాచుకోవడం. భవిష్యత్తులో బిడ్డకు ఏవైనా ఆనారోగ్య సమస్యలు వస్తే ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ విధానం స్టెమ్ సైట్ ఇండియా (StemCyteIndia) అందుబాటులోకి తెచ్చింది. ఆ సంస్థ ద్వారా ఉపాసన బిడ్డ కార్డు బ్లడ్ సేకరించి భద్రపరచనున్నారు. ఈ విధానంపై మన దేశంలో పెద్దగా అవగాహన లేదు. అయితే, గతంలో మహేశ్ బాబు సతీమణి నమ్రత కూడా తమ పిల్లల విషయంలో ఇలాంటి జాగ్రత్తలే తీసుకుంది.
I have chosen @StemCyte_India India to preserve my baby's CordBlood because of their unique Hybrid Model, Superior Technology and Highest Accreditations.
For more information, visit https://t.co/gQUuMlyRsG or call 1800 120 0086#StemCyteIndia #StemCellBanking#CordBlood… pic.twitter.com/CFMQvxTXSY
— Upasana Konidela (@upasanakonidela) June 13, 2023
Also Read..
Crocodile | బాలుడిని మింగేసిన మొసలిని కొట్టి చంపిన స్థానికులు
Nigeria Boat Capsizes | ఘోర పడవ ప్రమాదం.. 103 మంది మృతి
DC Venkatrami Reddy | డెక్కన్ క్రానికల్ మాజీ చైర్మన్ వెంకట్రామిరెడ్డి అరెస్ట్..