Unstoppable with NBK in Aha OTT | ఆహా వేదికగా బాలకృష్ణ వ్యాఖ్యాతగా మొదలైన unstoppable టాక్ షో అనుకున్న దాని కంటే పెద్ద విజయం సాధించింది. అసలు బాలయ్యను హోస్ట్‌గా పెట్టాలన్న ఆలోచన వచ్చినప్పుడే షో సగం సక్సెస్ అయింది. మిగిలిన సగం బాలకృష్ణ తన భుజాన వేసుకున్నాడు. వచ్చిన ప్రతి గెస్టుతో అద్భుతంగా మాట్లాడుతూ ఇండియాలోనే అత్యధిక imdb రేటింగ్ సాధించిన టాక్ షోగా దీన్ని నిలబెట్టాడు. సీజన్ 1 మొదటి ఎపిసోడ్ మంచు మోహన్ బాబుతో మొదలు పెట్టారు. ఆ తర్వాత చాలా మంది ఈ షోకు వచ్చారు. చివరి ఎపిసోడ్ మహేశ్ బాబుతో షూట్ చేశారు. ఫిబ్రవరి 4న ఇది ప్రసారం కానుంది. దీనికి సంబంధించిన ప్రోమో ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయింది. చాలా రోజుల తర్వాత ఒక టాక్ షోకి వచ్చిన మహేష్ బాగా ఓపెన్ అయిపోయి మాట్లాడాడు. ఈ ఎపిసోడ్ కోసం అటు నందమూరి.. ఇటు ఘట్టమనేని అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా సీజన్ 2 గురించి ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి.
తొలి సీజన్ బ్లాక్ బస్టర్ కావడంతో రెండో సీజన్ కోసం ఇప్పటి నుంచే ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టారు నిర్వాహకులు. అంతేకాదు సెకండ్ సీజన్ లో వచ్చే వ్యక్తులు కూడా మరింత ప్రత్యేకంగా ఉండబోతున్నారు. ముఖ్యంగా అందులో బాలయ్య సమకాలీకులు ఎక్కువగా రాబోతున్నట్లు తెలుస్తోంది. మొదటి సీజన్ లో అందరూ ఎక్కువగా వేచి చూసింది చిరంజీవి కోసం. ఎందుకంటే బాలయ్య, చిరంజీవి ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే అభిమానులకు అంతకంటే కావాల్సింది మరొకటి లేదు. పైగా ఆహా అల్లు అరవింద్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ కావడంతో కచ్చితంగా మొదటి సీజన్లోనే అది జరుగుతుందని అందరూ అనుకున్నారు. అయితే అనివార్య కారణాలతో చిరంజీవి రావడం కుదరలేదు. అందుకే సీజన్ 2 మొదటి ఎపిసోడ్ చిరంజీవితో మొదలుపెట్టాలని నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారు. అలాగే వెంకటేశ్, నాగార్జున, పవన్ కళ్యాణ్ సహా ఇండస్ట్రీలో ఉన్న మరికొందరు స్టార్ హీరోలు unstoppable సీజన్ 2లో ప్రత్యేకంగా నిలవబోతున్న ట్లు ప్రసారం జరుగుతుంది. ఒకవేళ ఇదే జరిగితే ఆహా రేంజ్ మరింత పెరగడం ఖాయం. అన్నట్లు సెకండ్ సీజన్ కోసం బాలయ్య పారితోషికం కూడా రెండింతలు పెరిగినట్లు తెలుస్తోంది. మొదటి సీజన్ కోసం 12 ఎపిసోడ్ లకు గానూ దాదాపు రూ.4 కోట్ల పారితోషికం అందుకున్నాడు బాలయ్య.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
అల్లు అరవింద్ నిర్మాతగా బాలయ్య భారీ సినిమా.. దర్శకుడు ఎవరంటే..?
Unstoppable | చిరంజీవిని కాదని బాలయ్యతో అన్ స్టాపబుల్ చేయడానికి కారణాలేంటి?
Unstoppable టాక్ షో కోసం బాలయ్యను అల్లు అరవింద్ అలా ఒప్పించాడా..?
ఆ హీరోయిన్ కోసం రవితేజను బాలయ్య కొట్టాడా? గొడవలపై క్లారిటీ వచ్చేసింది