Allu Aravind and Nandamuri Balakrishna | అన్‌స్టాపబుల్ తర్వాత బాలకృష్ణ, అల్లు అరవింద్ మధ్య బాండింగ్ మరింత పెరిగింది. నిజానికి అంతకుముందు నుంచే ఈ ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. కాకపోతే ఇది బయట ప్రపంచానికి తెలియడానికి చాలా సమయం పట్టింది. ఇప్పుడు ఇద్దరూ కలిసి ఓ సినిమా చేయబోతున్నారు. తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థల్లో గీతా ఆర్ట్స్ ఒకటి. 40 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ నిర్మాణ సంస్థలో వచ్చిన సినిమాలు తక్కువే కానీ విజయాల శాతం ఎక్కువ. గీతా ఆర్ట్స్ నుంచి సినిమా వస్తుంది అంటే అది ఖచ్చితంగా హిట్ అనే నమ్మకం కలిగించాడు అల్లు అరవింద్. ఆయన ఎంచుకునే కథలు కూడా అలాగే ఉంటాయి. ఇప్పుడు గీతా ఆర్ట్స్ సహ సంస్థలు వచ్చాయి. అల్లు అరవింద్ నమ్మిన బంటు బన్నీ వాసు వాటిని చూసుకుంటున్నాడు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా కథ నచ్చితే సినిమా చేస్తున్నారు గీతా ఆర్ట్స్. ఈ నేపథ్యంలోనే బాలకృష్ణతో అల్లు అరవింద్ నిర్మాతగా ఒక సినిమా చేయబోతున్నాడనే ప్రచారం జరుగుతుంది.
మొన్నటివరకు ఇలాంటి ఒక వార్త వస్తే కచ్చితంగా కొట్టిపారేసేవారు. ఎందుకంటే అల్లు అరవింద్, బాలకృష్ణ రెండు భిన్న ధ్రువాలు. వాళ్ళు ఎక్కడ కలిసి పని చేస్తారు అని అందరూ అనుకునే వాళ్ళు. అయితే ఆహాలో unstoppable అంటూ బాలయ్య ఒక టాక్ షో చేస్తున్నాడు. ఇందులో ఆయన హోస్ట్. కేవలం అల్లు అరవింద్ పై ఉన్న గౌరవం.. ఆ కాన్సెప్ట్ పై ఉన్న నమ్మకంతో యాంకర్‌గా మారిపోయాడు బాలకృష్ణ. ఈ స్నేహంతోనే త్వరలోనే ఈయన గీతా ఆర్ట్స్ లో సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే బాలయ్య కోసం ఓ కథ కూడా లాక్ చేసాడు అల్లు అరవింద్. కళ్యాణ్ రామ్ హీరోగా బింబిసార సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న మల్లిడి వశిష్ట్.. చెప్పిన కథ నచ్చి ఆయనకు అడ్వాన్స్ కూడా ఇచ్చాడు అల్లు అరవింద్. అవినీతి రహిత సమాజం కోసం పోరాడే ఒక పోలీస్ ఆఫీసర్ కథ ఇది. ఇందులో బాలయ్య పర్ఫెక్ట్ గా సరిపోతాడని అల్లు అరవింద్ భావిస్తున్నాడు. బాలయ్య, అల్లు అరవింద్ కాంబినేషన్లో సినిమాపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. మరి ఈ కాంబినేషన్లో రాబోయే మొదటి సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
Unstoppable | చిరంజీవిని కాదని బాలయ్యతో అన్ స్టాపబుల్ చేయడానికి కారణాలేంటి?
Unstoppable టాక్ షో కోసం బాలయ్యను అల్లు అరవింద్ అలా ఒప్పించాడా..?
NBK107 | బాలయ్య, గోపీచంద్ మలినేని సినిమాకు అదిరిపోయే టైటిల్..
ఆ ఒక్క సీన్ నచ్చలేదని సమరసింహారెడ్డిలో ఛాన్స్ వదులుకున్న హీరోయిన్.. ఎవరో తెలుసా?