Unstoppable టాక్ షో కోసం బాలయ్యను అల్లు అరవింద్ అలా ఒప్పించాడా..?

Balakrishna in Unstoppable | నందమూరి బాలకృష్ణ ఎలాంటివాడు అనేది ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయనను ఎన్నో ఏళ్లుగా చూస్తూనే ఉన్నాం. చిన్నపిల్లాడి మనస్తత్వం ఎలా ఉంటుందో బాలకృష్ణ కూడా అలాగే ఉంటాడని ఎంతో మంది చెప్పారు. కోపం వస్తే కొడతాడు.. ప్రేమ వస్తే దగ్గరకు తీసుకుంటాడు. అది బాలయ్య నైజం. మనసులో ఒకటి బయట ఒకటి పెట్టుకుని మాట్లాడటం బాలకృష్ణకు తెలియదు అంటూ చాలా మంది సినీ ప్రముఖులు కూడా చెప్పారు. అలాంటి కల్మషం లేని హీరో ఇప్పుడు Unstoppable అంటూ ఒక టాక్ షో చేస్తున్నాడు. ఆహా వేదికగా ఈ షో నవంబర్ 4న మొదలు కానుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన 5 ఎపిసోడ్లు పూర్తి చేశారు. మోహన్ బాబు మొదటి ఎపిసోడ్ గెస్ట్ గా రాబోతున్నారు. ఆ తర్వాత కూడా స్టార్స్ ను పిలిచారు. అయితే బాలకృష్ణను యాంకరింగ్ చేయించడానికి అల్లు అరవింద్ ఎలా ఒప్పించాడు అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్.

కొన్ని నెలల కింద సమంత హోస్ట్ గా ఒక టాక్ షో చేశారు. అనుకున్న దానికంటే ఆ షో కాస్త తక్కువ సక్సెస్ అయింది. దాంతో మరో టాక్ షో చేయాలని అల్లు అరవింద్ తన టీంతో కలిసి ఆలోచిస్తున్న సమయంలో.. చాలామంది చాలా స్టార్స్ పేర్లు చెప్పారు. అయితే అల్లు అరవింద్ మాత్రం బాలకృష్ణ చేస్తే ఎలా ఉంటుందని చెప్పగానే అందరూ బాగా ఎగ్జైట్ అయ్యారు. కాకపోతే యాంకరింగ్ చేయడానికి బాలయ్య ఒప్పుకుంటాడా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఆ సమయంలో అల్లు అరవింద్ తానున్నాను అంటూ టీంకు భరోసా ఇచ్చాడు. అన్నట్టుగానే బాలయ్య కు ఫోన్ చేసి మెల్లగా అసలు విషయం చెప్పాడు. మీరు ఆహా చూస్తారా అని బాలయ్యను అడిగితే చూస్తాను అని సమాధానం వచ్చింది. ఆ తర్వాత సమంత టాక్ షో చూశారా అని అల్లు అరవింద్ అడిగిన ప్రశ్నకు చూశాను అని సమాధానం బాలకృష్ణ నుంచి వచ్చింది. అచ్చంగా అలాంటి ఒక షో అనుకుంటున్నాం.. మీరు హోస్టింగ్ చేస్తే బాగుంటుంది అని బాలయ్యను అడిగాడు నిర్మాత అల్లు అరవింద్. మీరు ఓకే అంటే మా టీం వచ్చి మీకు పూర్తిగా వివరిస్తారని ఎప్పుకొచ్చాడు. దానికి బాలయ్య కూడా ఓకే అన్నాడు. కాన్సెప్ట్ నచ్చడంతో బాలయ్య కూడా యాంకరింగ్ చేయడానికి ఓకే చెప్పాడు. ఇలా విషయం సూటిగా సుత్తి లేకుండా ఒక్క ఫోన్ కాల్తో అయిపోయింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Balakrishna in Hospital | బాలకృష్ణకు ఎన్ని రోజులు విశ్రాంతి అవసరం.. షూటింగ్కు ఎప్పుడొస్తాడు..?
Unstoppable | ఆహా షో కోసం బాలయ్య అబ్బా అనిపించే రెమ్యునరేషన్..
Balakrishna | బాలకృష్ణపై పవన్ కల్యాణ్ స్పీచ్ ఎఫెక్ట్..!
Alia bhatt | అమ్మో రెండేండ్లలో ఆలియాభట్ అంత సంపాదించిందా?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

