Unni Mukundan | ప్రముఖ మలయాళం నటుడు ఉన్ని ముకుందన్ ఇన్స్టాగ్రామ్ ఖాతా (@iamunnimukundan) హ్యాక్ అయ్యింది. ఈ విషయాన్ని ముకుందన్ ఫేస్బుక్ ద్వారా వెల్లడించాడు. హ్యాక్ అయిన అకౌంట్ నుంచి సందేశాలు వస్తే అప్రమత్తంగా ఉండాలని తన అభిమానులకు విజ్ఞప్తి చేశాడు.
తన ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి వస్తున్న అప్డేట్లు, DM(సందేశాలు)లు, స్టోరీలు, ఇతర కంటెంట్ తాను పెడుతున్నవి కావని.. అవి హ్యాకర్ల ద్వారా పోస్ట్ చేయబడుతున్నాయని ముకుందన్ తెలిపారు. హ్యాక్ చేయబడిన ఖాతాతో ఎంగేజ్ కావద్దని, ఎలాంటి అనుమానాస్పద లింక్‌లను క్లిక్ చేయవద్దని లేదా వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవద్దని ఆయన తన అనుచరులను కోరారు.
ఈ సమస్యను పరిష్కరించడానికి.. తన ఖాతాపై తిరిగి నియంత్రణ పొందడానికి నాతో పాటు సైబర్ అధికారులు పనిచేస్తున్నారని.. సమస్య పరిష్కరించబడిన తర్వాత తన ఫేస్బుక్ ద్వారా అభిమానులకు అప్డేట్ చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. మరోవైపు ముకుందన్‌కి చెందిన ఇన్స్టాగ్రామ్ పేజీ ఉన్ని ముకుందన్ ఫిల్మ్స్‌ని కూడా సైబర్ నేరస్థులు టార్గెట్ చేసినట్లు తెలుస్తుంది.