Tom Cruise – Ana de Armas | హాలీవుడ్ సూపర్ స్టార్ టామ్ క్రూజ్, నటి అనా డి అర్మాస్ గత కొన్ని రోజులుగా డేటింగ్లో ఉన్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. 63 ఏండ్లు ఉన్న టామ్ 37 ఏండ్ల అనా డితో డేటింగ్లో ఉన్నట్లు హాలీవుడ్లో పలు కథనాలు వెల్లడయ్యాయి. అయితే తాజాగా వీరిద్దరూ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి ‘డీపర్’ అనే యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరి మధ్య సాన్నిహిత్యం పెరిగి పెళ్లి వరకు చేరిందని టాక్. అయితే వీరిద్దరూ పెళ్లికి సంబంధించిన ఒక విషయం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఈ జంట తమ పెళ్లిని అంతరిక్షంలో లేదా సముద్రం అడుగుభాగంలో (అండర్‌వాటర్ వెడ్డింగ్) చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఆనా డి ఆర్మాస్, టామ్ క్రూజ్ ఇద్దరికి అడ్వెంచరస్ ఫీట్స్ చేయడమంటే చాలా ఆసక్తి ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ విషయంపై టామ్ లేదా అన్నాడి స్పందించాల్సి ఉంది.