బెల్లంకొండ సాయిశ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా రూపొందుతున్న హారర్ మిస్టరీ థ్రిల్లర్ ‘కిష్కిందపురి’. కౌశిక్ పెగల్లపాటి దర్శకుడు. సాహు గారపాటి నిర్మాత. నిర్మాణం తుదిదశకు చేరుకున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ప్రచారంలో భాగంగా ఈ సినిమాలోని తొలిపాటను మేకర్స్ విడుదల చేశారు. ‘ఉండిపోవే నాతోనే..’ అంటూ సాగే ఈ పాటను పూర్ణాచారి రాయగా, చైతన్య భరద్వాజ్ స్వరపరిచారు. జావేద అలీ ఆలపించారు.
బెల్లంకొండ సాయిశ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ల కెమిస్ట్రీ ఈ పాటలో అద్భుతంగా ఉంటుందని, ప్రేమలోని భావోద్వేగాలను ఆవిష్కరించేలా ఈ పాట సాగిందని, అందమైన బీచ్ సైడ్ విజువల్స్ చాలా ప్లెజెంట్‌గా ఉంటాయని మేకర్స్ తెలిపారు. రాజుసుందరం కొరియోగ్రఫీ ఈ పాటకు హైలైట్‌గా నిలుస్తుందని కూడా తెలియజేవారు. హారర్ మిస్టరీ కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమా అన్ని వయసుల వారికీ నచ్చుతుందని హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ తెలిపారు. ఇంకా దర్శకుడు కౌశిక్ పెగల్లపాటి, అనుమప పరమేశ్వరన్, సంగీత దర్శకుడు చైతన్ భరద్వాజ్ తదితరులు కూడా మాట్లాడారు.