UI The Movie | ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టాలెంటెడ్ మ్యూజిక్ కంపోజర్లలో ఒకడు అజనీష్ లోక్‌నాథ్. కాంతార సినిమాకు అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ అందించి టాక్ ఆఫ్ ది గ్లోబల్ ఇండస్ట్రీగా నిలిచాడు. తెలుగులో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర (Upendra) లీడ్ రోల్లో వస్తోన్న చిత్రం ‘UI’ (UITheMovie). ఈ చిత్రానికి అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు.
ఈ చిత్రం అజనీష్ లోక్‌నాథ్‌కు 50వది కావడం విశేషం. ఈ విషయాన్ని తెలియజేస్తూ ప్రత్యేక సందేశాన్ని అందరితో పంచుకుంది ఉపేంద్ర టీం. 50 సినిమాలు.. 50 భావోద్వేగాలు..50 కథలు..ఒక మ్యాస్ట్రో.. హృదయాలను హత్తుకునే ఆత్మీయమైన ట్యూన్ల నుంచి మనల్ని డ్యాన్స్ చేయించే ఎనర్జిటిక్ బీట్ల వరకు అజనీష్ అన్నీ చేశారు. ఆయన UiTheMovieతో తన 50వ మైల్ స్టోన్‌కు చేరుకున్నారు. ఈ అజనీష్ మరపురాని సంగీత ప్రయాణానికి హామీ ఇచ్చాడు… అంటూ షేర్ చేశారు మేకర్స్.
మనోహరన్-శ్రీకాంత్ కేపి సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ మూవీలో రీష్మా నానయ్య హీరోయిన్గా నటిస్తోంది. రీసెంట్గా ఈ మూవీ నుంచి సౌండ్ ఆఫ్ యూఐ (Sound Of Ui)ని లాంచ్ చేయగా.. . సినిమా ఎలా ఉండబోతుందో హింట్ ఇస్తూ సాగే థీమ్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ఈ చిత్రాన్ని కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల చేయనుంది. ఇప్పటికే అనౌన్స్మెంట్ వీడియో కూడా విడుదల చేయగా.. నెట్టింట వైరల్ అవుతోంది. లహరి ఫిలిమ్స్, వీనస్ ఎంటర్టైనర్స్ సంయుక్త నిర్మాణంలో వస్తున్న ఈ మూవీకి సంబంధించిన బీటీఎస్ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది.
✨ 50 Films. 50 Emotions. 50 Stories. One Maestro. ✨
From the soulful tunes that touch hearts to the energetic beats that get us dancing, @AJANEESHB has done it all! 🥁🎶 With #UiTheMovie He marks his 50th milestone, promising yet another unforgettable musical journey. 🎬🎵… pic.twitter.com/1bOhp7mK5I
— BA Raju’s Team (@baraju_SuperHit) August 29, 2024
Sreeleela | కోలీవుడ్ ఎంట్రీకి శ్రీలీల రెడీ.. ఏ స్టార్ హీరోతోనంటే..?
Saripodhaa Sanivaaram | నాని-వివేక్ ఆత్రేయ సరిపోదా శనివారంపై నెటిజన్ల టాక్ ఎలా ఉందంటే..?
Sreeleela | కోలీవుడ్ ఎంట్రీకి శ్రీలీల రెడీ.. ఏ స్టార్ హీరోతోనంటే..?
Coolie | రజినీకాంత్ కూలీలో మంజుమ్మెల్ బాయ్స్ నటుడు.. ఇంతకీ పాత్రేంటో మరి..?