చిత్రం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ఉదయ్ కిరణ్.. ఆ తర్వాత కొన్ని నెలల వరకు మళ్లీ ఎవరికీ కనిపించలేదు. ఏదో గాలివాటం విజయం వచ్చింది.. మళ్లీ ఎవరికీ కనిపించడులే అని అంతా అనుకున్నారు. అవకాశాలు కూడా ఎవ్వరూ ఇవ్వలేదు. అలాంటి సమయంలో తనకు లైఫ్ ఇచ్చిన తేజనే మరోసారి నువ్వు నేనుతో ఈయన్ను స్టార్‌గా మార్చేశాడు. నిజానికి నువ్వు నేను సినిమాను మాధవన్ హీరోగా చేయాలనుకున్నాడు తేజ. కథ కూడా చెప్పాడు అయితే తెలుగు సినిమాలు చేయడం ఇష్టం లేని ఈయన నిర్ణయాన్ని పెండింగ్‌లో పెట్టాడు. అదే సమయంలో తనకు మరో అవకాశం ఇవ్వాలంటూ రోజూ తేజ ఆఫీసుకు వచ్చి కూర్చునేవాడు ఉదయ్ కిరణ్. దాంతో వాళ్లు వీళ్లు ఎందుకు.. ఈ కుర్రాన్నే పెట్టి సినిమా తీద్దామని నువ్వు నేను ఉదయ్ కిరణ్‌తోనే చేశాడు. కేవలం 2 కోట్ల బడ్జెట్‌తో సినిమా చేసి 3 కోట్ల బిజినెస్ చేశారు. కానీ వచ్చిన కలెక్షన్స్ మాత్రం అప్పట్లో ట్రేడ్‌కు షాక్ ఇచ్చాయి. ఆగస్ట్ 10, 2001న విడుదలైన ఈ చిత్రానికి నేటితో 20 ఏళ్లు పూర్తయ్యాయి. మరి నువ్వు నేను ఫైనల్ కలెక్షన్స్ ఎంతో చూద్దామా..
నైజాం: 4.65 కోట్లు
సీడెడ్: 1.55 కోట్లు
ఉత్తరాంధ్ర: 1.62 కోట్లు
ఈస్ట్: 1.11 కోట్లు
వెస్ట్: 0.89 కోట్లు
గుంటూరు: 0.93 కోట్లు
కృష్ణా: 0.85 కోట్లు
నెల్లూరు: 0.52 కోట్లు
ఏపీ + తెలంగాణ: 12.09 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్: 3.44 కోట్లు
వరల్డ్ వైడ్: 15.39 కోట్లు
నువ్వు నేను సినిమాను అప్పట్లో 3.2 కోట్లకు బిజినెస్ చేశారు. విడుదలైన తొలిరోజు మార్నింగ్ షో నుంచే సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. ఉదయ్ కిరణ్ నటన.. అనిత పర్ఫార్మెన్స్.. సునీల్ కామెడీ.. తెలంగాణ శకుంతల, తణికెళ్ల భరణి కాంబినేషన్.. ఆర్పీ పట్నాయక్ పాటలు.. ఒకటేంటి నువ్వు నేను సినిమాకు అన్నీ కలిసొచ్చాయి. దాంతో సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఒకటి రెండు కాదు నిర్మాతలకు, బయ్యర్లకు ఏకంగా 12 కోట్లకు పైగా లాభాలు తీసుకొచ్చింది ఈ చిత్రం. అందుకే 20 ఏళ్లైనా కూడా నువ్వు నేను అద్భుతం అంతే.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
పవన్ కళ్యాణ్ సినిమా విషయంలో రానాకు అన్యాయం చేస్తున్నారా..?
సరికొత్త రికార్డులు సెట్ చేసిన మహేష్ బాబు
20 మిలియన్ల అభిమానాన్ని పొందిన రష్మిక
Prakash Raj Surgery | ప్రకాశ్ రాజ్‌కు సర్జరీ..అసలేం జరిగిందంటే..?