Chirajnjeevi | కేరళ రాష్ట్రానికి చెందిన పాపులర్ నటుడు, మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ (Mohanlal) దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు (Dadasaheb Phalke Award) అందుకోనున్నారని తెలిసిందే. 2023 సంవత్సరానికిగాను మోహన్‌లాల్‌ను దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపిక చేసినట్టు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ శనివారం ప్రకటించింది. ఈ నేపథ్యంలో మోహన్ లాల్‌కు సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇప్పటికే పవన్ కల్యాణ్ తన విషెస్ అందించాడు.
తాజాగా టాలీవుడ్ స్టార్ యాక్టర్ చిరంజీవి ఎక్స్ వేదికగా చిరకు విషెస్ తెలియజేశాడు.ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకోబోతున్న నా ప్రియమైన లాలెట్టన్ @ మోహన్ లాల్‌కు హృదయపూర్వక అభినందనలు. మీ అద్భుతమైన సినీ ప్రయాణం, ఐకానిక్ ప్రదర్శనలు భారతీయ సినిమాను మరింత సుసంపన్నం చేశాయి. మీ ప్రతిభకు నిజమైన తగిన గుర్తింపు ఇది.. అంటూ ఎక్స్‌లో ట్వీట్ చేశాడు చిరు. మోహల్ లాల్, చిరంజీవి ఆప్యాయంగా కలిసి దిగిన ఫొటోను ట్వీట్ చేయగా ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్ అవుతోంది.
భారత సినిమా రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా మోహన్‌లాల్‌ను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపికచేశామని సమాచార, ప్రసార శాఖ పేర్కొంది. భారత సినిమా రంగంలో కొన్ని తరాలపాటు ఆయన నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా ఎనలేని సేవలు అందించారని కొనియాడింది. ఈ నెల 23న జరుగనున్న 71వ జాతీయ సినిమా అవార్డుల కార్యక్రమంలో మోహన్‌లాల్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకోనున్నారు.
My dear Lalettan @Mohanlal, heartfelt congratulations on being honoured with the prestigious Dadasaheb Phalke Award🌟
Your remarkable journey and iconic performances have enriched Indian cinema. Truly a well-deserved recognition 💐 pic.twitter.com/fuS9IaFJNl
— Chiranjeevi Konidela (@KChiruTweets) September 21, 2025
Kantara Chapter 1 | రిషబ్ శెట్టి టీంకు ప్రభాస్ సపోర్ట్.. కాంతార చాప్టర్-1పై సూపర్ హైప్
SYG | సాయి దుర్గ తేజ్ సంబరాల యేటి గట్టు విడుదల వాయిదా.. మేకర్స్ క్లారిటీ
They Call Him OG | ఓజీ కోసం రూల్ బ్రేక్ చేసిన పవన్ కల్యాణ్.. థమన్ కామెంట్స్ వైరల్