Adarsha Kutumbam House No47 | మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, విక్టరీ వెంకటేశ్ కాంబినేషన్లో ఒక సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌ను అనౌన్స్మెంట్ చేశారు మేకర్స్. ఈ సినిమాకు ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47’ అనే క్లాస్ టైటిల్‌ను పెట్టినట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా వెంకటేశ్ ఫస్ట్ లుక్‌ని విడుదల చేసింది. ఈ ఫస్ట్‌లుక్‌లో వెంకిమామ ఫ్యామిలీ మ్యాన్ల కనిపిస్తున్నాడు. గతంలో ఈ కాంబోలో వచ్చిన ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ చిత్రాలు ఫ్యామిలీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయితే ఇన్నేళ్ల తర్వాత వీరిద్దరి కాంబోలో ఈ సినిమా వస్తుండటంతో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు.
ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈరోజు నుంచి ప్రారంభం కాబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ చిత్రంలో వెంకటేశ్‌కు జోడీగా శ్రీనిధి శెట్టిని తీసుకోబోతున్నట్లు సమాచారం. అలాగే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.
The title. The vibe.
The excitement. ALL LOADED! 🤩Presenting the Title & First Look of
“𝐀𝐚𝐝𝐚𝐫𝐬𝐡𝐚 𝐊𝐮𝐭𝐮𝐦𝐛𝐚𝐦 𝐇𝐨𝐮𝐬𝐞 𝐍𝐨: 𝟒𝟕 – 𝐀𝐊 𝟒𝟕” 🏠🔥#AK47 | #AadarshaKutumbam | #Venky77 | #VenkateshXTrivikramShoot kicks off today… arriving BIG this Summer… pic.twitter.com/ZmWnumxnoP
— Haarika & Hassine Creations (@haarikahassine) December 10, 2025