Saggubiyyam | ఏ సీజన్లో అయినా సరే రోజూ తీసుకోవాల్సిన ఔషధం.. సగ్గు బియ్యం.. దీంతో కలిగే లాభాలు ఇవే..!
సాబుదానా లేదా సగ్గుబియ్యం గురించి అందరికీ తెలిసిందే. సాధారణంగా దీన్ని చాలా మంది తీపి వంటకాల తయారీలో ఉపయోగిస్తారు. దీంతో పాయసం లేదా పరమాన్నం వంటివి చేస్తారు. అయితే సగ్గు బియ్యం వాస్తవానికి ఒక ప్రాసెస్ చేయబడిన ఆహారం.
Saggubiyyam | సాబుదానా లేదా సగ్గుబియ్యం గురించి అందరికీ తెలిసిందే. సాధారణంగా దీన్ని చాలా మంది తీపి వంటకాల తయారీలో ఉపయోగిస్తారు. దీంతో పాయసం లేదా పరమాన్నం వంటివి చేస్తారు. అయితే సగ్గు బియ్యం వాస్తవానికి ఒక ప్రాసెస్ చేయబడిన ఆహారం. అయినప్పటికీ ఇది ఆరోగ్యకరమైనదే అని చెప్పవచ్చు. దీన్ని కర్ర పెండలం చెట్టుకు చెందిన దుంపల నుంచి తయారు చేస్తారు. అందువల్ల ఇది పూర్తిగా ఆరోగ్యకరమైనదే. ఆయుర్వేదంలోనూ సగ్గుబియ్యానికి ఎంతో ప్రాధాన్యత కల్పించారు. దీంతో పలు ఔషధాలను కూడా తయారు చేస్తారు. సగ్గు బియ్యాన్ని తీసుకోవడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి. దీన్ని పాయసం లేదా జావగా తయారు చేసి తీసుకుంటారు. ఇది మనకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది. పలు వ్యాధులను నయం చేసేందుకు సహాయం చేస్తుంది.
పొట్టలో అసౌకర్యం, శరీరంలో వేడి..
సగ్గుబియ్యంలో పిండి పదార్థాలు అధికంగా ఉంటాయి. కనుక దీంతో జావ తయారు చేసి తాగితే శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. ఉత్సాహంగా ఉంటారు. చురుగ్గా పనిచేస్తారు. నీరసం, అలసట తగ్గిపోతాయి. బద్దకం తగ్గుతుంది. సగ్గుబియ్యాన్ని ఉదయం తీసుకుంటే రోజంతా శరీరంలో శక్తి స్థాయిలు అధికంగా ఉంటాయి. సగ్గు బియ్యం మన శరీరానికి చలువ చేస్తుంది. కనుక దీన్ని ఎక్కువగా వేసవిలో తీసుకుంటారు. అయితే కొందరికి ఎల్లప్పుడూ వేడి శరీరం ఉంటుంది. లేదా కొందరికి కారం, మసాలా ఉండే ఆహారాలను తింటే పడదు. అలాంటి సందర్భాల్లో సగ్గు బియ్యాన్ని తీసుకుంటే ఎంతో ఉపశమనం లభిస్తుంది. ఇది పొట్టలో ఉండే అసౌకర్యాన్ని, విరేచనాలను, శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. సగ్గుబియ్యాన్ని పాలు లేదా నీటిలో ఉడికించి అందులో కాస్త చక్కెర కలిపి తింటుండాలి. దీని వల్ల పొట్టలో ఉండే అసౌకర్యం, శరీరంలోని వేడి తగ్గిపోతాయి.
జీర్ణ సమస్యలకు..
సగ్గుబియ్యాన్ని తినడం వల్ల జీర్ణ సమస్యలు అన్నింటినీ తగ్గించుకోవచ్చు. ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది. అజీర్తి తగ్గుతుంది. గ్యాస్, అసిడిటీ నుంచి ఉపశహమనం లభిస్తుంది. మలబద్దకం తగ్గుతుంది. విరేచనాల నుంచి బయట పడవచ్చు. సగ్గు బియ్యం తేలిగ్గా జీర్ణమవుతాయి. కనుక వృద్ధులు, పిల్లలు కూడా సులభంగా తినవచ్చు. సగ్గు బియ్యాన్ని రోజూ ఒక కప్పు మోతాదులో తింటుంటే జీర్ణ వ్యవస్థలో ఉండే అల్సర్లు తగ్గిపోతాయి. ముఖ్యంగా జీర్ణాశయం, పేగుల్లో ఉండే పుండ్లు మానుతాయి. పేగుల వాపుల నుంచి కూడా బయట పడవచ్చు. సగ్గు బియ్యంలో పిండి పదార్థాలతోపాటు ప్రోటీన్లు, విటమిన్ సి, క్యాల్షియం అధికంగా ఉంటాయి. అందువల్ల శరీరానికి పోషకాలు, శక్తి రెండూ లభిస్తాయి.
ఎముకల ఆరోగ్యానికి..
సగ్గు బియ్యంలో ఉండే క్యాల్షియం ఎముకలు, దంతాలను దృఢంగా మార్చి ఆరోగ్యంగా ఉంచుతుంది. విరిగిన ఎముకలు అతుక్కుంటున్న వారు వీటిని రోజూ తింటుంటే ఉపయోగం ఉంటుంది. ఎల్లప్పుడూ నీరసంగా, అలసటగా, బద్దకంగా ఉండేవారు కూడా సగ్గుబియ్యాన్ని తింటుండాలి. దీని వల్ల శక్తి లభించి ఉత్సాహంగా మారుతారు. చురుగ్గా పనిచేస్తారు. జ్వరం వచ్చిన వారికి ఆహారం తినాలనిపించదు. అలాంటి వారు సగ్గు బియ్యాన్ని జావగా తయారు చేసుకుని తాగుతుంటే ఎంతో శక్తి లభిస్తుంది. నీరసం తగ్గిపోతుంది. జ్వరం నుంచి త్వరగా కోలుకుంటారు. సగ్గు బియ్యాన్ని తింటుంటే శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. బీపీ తగ్గుతుంది. హైబీపీ ఉన్నవారికి ఇది ఎంతో మేలు చేస్తుంది. రోజూ తింటుంటే బీపీ నియంత్రణలో ఉంటుంది. ఇక సగ్గు బియ్యం గ్లైసీమిక్ ఇండెక్స్ విలువ 80 వరకు ఉంటుంది. అందువల్ల దీన్ని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరుగుతాయి. కనుక డయాబెటిస్ ఉన్నవారు సగ్గుబియ్యాన్ని తినకూడదు. ఇలా జాగ్రత్తలను పాటిస్తూ దీన్ని తింటుంటే అనేక లాభాలను పొందవచ్చు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఈ 29న దేవరకొండలో ఘనంగా దీక్షా దివస్’
Pakistani Drama | బెంగళూరులో పాక్ డ్రామాకు బ్రేక్.. సోషల్ మీడియా వ్యతిరేకతతో రెండు షోలు రద్దు!
Biker | బైకర్‌ను ఢీకొట్టిన కార్లు.. ఏం జరిగిందో చూడండి.. వీడియో
Hotel Demolish Attempt | ఎమ్మెల్యేను ప్రశ్నించినందుకు హోటల్ తొలగింపునకు యత్నం.. బాధితుడు ఆందోళన
Professor D Rajireddy | అగ్రోమెటియరాలజీలో ప్రొఫెసర్ డి. రాజిరెడ్డికి గౌరవ ఫెలోషిప్ ప్రదానం
ట్రెండింగ్ వార్తలు
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ

