Bigg Boss Beauty | బుల్లితెర ప్రేక్షకులకు బిగ్‌బాస్ సీజన్-8 ద్వారా పరిచయమైన ఫైర్ బ్రాండ్ కంటెస్టెంట్ సోనియా ఆకుల నుంచి సంతోషకరమైన వార్త వచ్చింది. రీసెంట్గా ఆమె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సోనియా-యష్ దంపతులు ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. అలాగే తమ చిన్నారికి ‘శిఖా వీరగోని’ అని పేరు పెట్టినట్లు వెల్లడించారు. ఆమె రాకతో మా ప్రపంచం సంపూర్ణం అయింది. మా ప్రేమకి మేము పెట్టిన మరో పేరు ‘శిఖా వీరగోని అంటూ యష్ సోషల్ మీడియాలో ఎమోషనల్ నోటుతో ప్రకటించడంతో సెలబ్రెటీలు, ఫ్యాన్స్ ఇద్దరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
బిజినెస్‌మ్యాన్ యష్‌కి శ్వేత అనే చెల్లెలు ఉండేది. ఆమె రెండు సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది. ఈ సందర్భాన్ని ఇస్మార్ట్ జోడీ 3లో గుర్తుచేసుకుంటూ యష్ భావోద్వేగానికి గురైన విషయం తెలిసిందే. ఇప్పుడు యష్-సోనియా దంపతులకు పాప పుట్టడంతో, “నీ చెల్లెలే మళ్లీ పుట్టింది అన్నా” అంటూ నెటిజన్లు భావోద్వేగంతో కామెంట్లు పెడుతున్నారు.ఇటీవల సుమ అడ్డా షోలో సోనియా సీమంతం కూడా జరగగా, ఇప్పుడు చిన్నారి పుట్టిన వార్తతో వీరి కుటుంబంలో ఆనందం నెలకొంది. ఆర్జీవీ రూపొందించిన ‘కరోనా వైరస్’ సినిమాతో హీరోయిన్గా టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన సోనియా, మోడల్‌గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
‘లా’ చదివిన సోనియా బిగ్‌బాస్ సీజన్-8లోకి అడుగుపెట్టి తన కౌంటర్లతో, పాయింట్లతో ప్రత్యేకమైన ముద్ర వేసింది. కానీ నిఖిల్–పృథ్వీతో నడిపిన “పెద్దోడు–చిన్నోడు” ట్రాక్ సోషల్ మీడియాలో నెగెటివిటీ తీసుకురావడంతో ఊహించని విధంగా త్వరగానే ఎలిమినేట్ అయింది.రీఎంట్రీలో భాగంగా హౌస్‌లోకి వెళ్లి నిఖిల్‌ను నామినేట్ చేస్తూ హాట్ టాపిక్‌గా మారింది. షో ముగిసిన వెంటనే తన ప్రియుడు యష్‌తో నిశ్చితార్థం చేసుకుని త్వరగానే పెళ్లి కూడా చేసుకుంది.ఈ పెళ్లి వేడుకకు పృథ్వీ సహా బిగ్‌బాస్ ఫ్రెండ్స్ చాలామంది హాజరయ్యారు. అయితే నిఖిల్ మాత్రం ఎక్కడా కనిపించలేదు. పాప పుట్టడంతో యష్–సోనియా జీవితంలో కొత్త ఆనందం చేరింది. చిన్నారి ఆరోగ్యంగా ఉందని సమాచారం. సోషల్ మీడియాలో అభిమానులు, సెలబ్రెటీలు వరుసగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.