Pushpa 2 | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన ‘పుష్ప’ ఫ్రాంచైజ్ దేశవ్యాప్తంగా సెన్సేషన్‌గా నిలిచిన విషయం తెలిసిందే ‘పుష్ప: ది రైజ్’ భారీ విజయాన్ని సాధించగా, రెండో భాగం ‘పుష్ప 2: ది రూల్’ అయితే ఇండియన్ సినీ చరిత్రలో కొత్త రికార్డు సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.1870 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్‌తో దూసుకెళ్లిన ఈ చిత్రం, ఒక్క హిందీ బాక్సాఫీస్ నుంచే రూ.800 కోట్లకుపైగా వసూలు సాధించి సంచలనం సృష్టించింది.ఈ అద్భుత విజయానికి ప్రధాన కారణం నార్త్‌లో నిర్వహించిన ప్రత్యేక ప్రమోషనల్ ఈవెంట్ అని నిర్మాత వై. రవి శంకర్ వెల్లడించారు. ‘చాయ్ షాట్స్’ గ్రాండ్ లాంచ్ ఈవెంట్‌కు గెస్టుగా హాజరైన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
మైత్రీ కంపెనీ ఎదగడంలో చాయ్ బిస్కెట్ శరత్, అనురాగ్ చేసిన కృషి అపారమైనది. వాళ్లు మా కంపెనీకి పిల్లర్స్‌లా పని చేశారు. క్రియేటివ్ సైడ్, సోషల్ మీడియా క్యాంపైన్స్ విషయంలో అద్భుత సపోర్ట్ ఇచ్చారు” అన్నారు.అంతేకాదు, చాయ్ షాట్స్ సంస్థ ఎదుగుదలకు తన పూర్తి మద్దతు ఉంటుందని, ఈ సంస్థ భవిష్యత్తులో వేల కోట్ల విలువైన బ్రాండ్‌గా మారే శక్తి ఉందని కూడా అభిప్రాయపడ్డారు. పుష్ప 2 ప్రమోషన్ కోసం అనేక పెద్ద సంస్థలతో మీటింగ్స్ ఏర్పాటు చేసిన తర్వాత, చాయ్ బిస్కెట్ టీమ్ ఇచ్చిన ఐడియానే అమలు చేశామని రవి శంకర్ వెల్లడించారు.“బీహార్‌లో భారీ ఈవెంట్ నిర్వహించాలనే కోర్ ఐడియా శరత్, అనురాగ్ నుంచే వచ్చింది. ఆ ఈవెంట్ హిందీ మార్కెట్లో ఊహించని స్థాయిలో హైప్ క్రియేట్ చేసింది.
అదే కారణంగా హిందీ బాక్సాఫీస్ నుంచి అదనంగా రూ.300 – 400 కోట్ల నెట్ వసూళ్లు వచ్చాయి” అని ఆయన స్పష్టం చేశారు. మైత్రీ మూవీస్, చాయ్ బిస్కెట్ సంస్థలు ఒకేసారి ఆరంభమయ్యాయి. మేము అందుబాటులో లేకపోయినా వాళ్లు ఏ పని అయినా చూసుకుంటారని మా టీమ్‌కి ప్రత్యేక సూచనలు ఇచ్చాం. భవిష్యత్తులో కూడా చాయ్ షాట్స్‌తో కలిసి పనిచేయడానికి మేము ఆసక్తిగా ఉన్నాం అని అన్నారు.‘పుష్ప 2’ వసూళ్ల వెనుక ఉన్న అసలైన మార్కెటింగ్ మైండ్ ఇదే అన్న విషయాన్ని రవి శంకర్ మాటలు మరోసారి రుజువు చేశాయి. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు ఫిల్మ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.