అన్నయ్యకు జ్వరం వస్తేనే తట్టుకోలేకపోయాడు.. మహేశ్ బాబు గురించి త్రివిక్రమ్ షాకింగ్ నిజం..

Ramesh babu | తెలుగు ఇండస్ట్రీలోని ఎవర్ గ్రీన్ కాంబినేషన్స్‌లో త్రివిక్రమ్, మహేశ్ బాబు కచ్చితంగా ఉంటుంది. ఈ ఇద్దరూ కలిసి బ్లాక్ బస్టర్ సినిమాలు ఇవ్వకపోవచ్చు.. కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉన్నంత కాలం గుర్తుండిపోయే సినిమాలు ఇచ్చారు. 17 ఏళ్ల కిందట వచ్చిన అతడు.. 12 ఏళ్ల కిందట వచ్చిన ఖలేజా సినిమాలు ఆల్ టైం క్లాసిక్స్ గా నిలిచిపోయాయి. ఆ సినిమాలు విడుదలైన సమయాల్లో ఉన్న పరిస్థితుల కారణంగా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా కలెక్షన్స్ తీసుకురాలేదు.. కానీ తర్వాత మాత్రం ఆ సినిమాలు క్లాసిక్ హోదా అందుకున్నాయి. త్వరలోనే ఈ కాంబినేషన్లో మరో సినిమా రాబోతోంది. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే అన్నయ్య రమేశ్ బాబుతో మహేశ్‌బాబుకు ఉన్న అనుబంధం గురించి త్రివిక్రమ్ శ్రీనివాస్ గుర్తుచేసుకున్నారు.
ఖలేజా సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఒకరోజు మహేశ్ బాబు ఒక ఫోన్ కాల్ మాట్లాడి దిగాలుగా ఉన్నాడు. ఈ విషయం గమనించిన త్రివిక్రమ్ దగ్గరికి వచ్చి ఏమైంది అని అడిగితే.. తన అన్నయ్య రమేశ్ బాబు ఆరోగ్యం బాగోలేదని జ్వరంతో బాధ పడుతున్నాడని చెప్పుకొచ్చాడు. అయితే షూటింగ్ క్యాన్సల్ చేద్దామా అని మహేశ్ బాబును అడిగాడు త్రివిక్రమ్. కానీ భారీ బడ్జెట్ సినిమా కావడంతో అవసరం లేదని చెప్పి.. ఆ బాధలోనే షూటింగ్ పూర్తి చేసి వెంటనే హాస్పిటల్‌కు వెళ్లిపోయాడు మహేశ్ బాబు. ఆయనకు అన్నయ్య రమేశ్ బాబు అంటే అంత ఇష్టం.. అతడికి ఏదైనా చిన్న అనారోగ్యం వస్తేనే తట్టుకోలేడు.. అలాంటిది ఇప్పుడు ఏకంగా రమేశ్ బాబు మరణించడం మహేశ్‌కు తీరని లోటు అని చెప్పాడు త్రివిక్రమ్. నువ్వే నాకు సర్వస్వం అన్నయ్య.. నువ్వు లేని నేను సగం మాత్రమే.. ఎన్ని జన్మలైనా నువ్వే నాకు అన్నయ్యగా కావాలి అంటూ సోషల్ మీడియాలో మహేశ్ బాబు పోస్ట్ చేసిన లెటర్ అందరి చేత కన్నీళ్లు పెట్టించింది. మహేశ్ హీరోగా నటించిన అర్జున్, అతిథి సినిమాలకు రమేశ్ బాబు నిర్మాత. దూకుడు, ఆగడు సినిమాలకు సమర్పకుడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Ramesh babu | మొదటి సినిమాకే బాలయ్యతో వివాదం..
Mahesh | మరో జన్మంటూ ఉంటే.. అప్పుడూ నువ్వే నా అన్నయ్య: సోదరుడి మృతిపై మహేశ్ ట్వీట్
మహేశ్ బాబు సోదరుడు రమేశ్ బాబు గురించి ఈ విషయాలు తెలుసా!
రమేశ్‌బాబు మృతిపట్ల చిరంజీవి దిగ్భ్రాంతి
తమిళ హీరోతో ప్రేమలో పడ్డ నిధి అగర్వాల్.. అతని ఇంటికే షిఫ్ట్ అయిన ఇస్మార్ట్ బ్యూటీ !
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పట్టభద్రులు ఓటు నమోదులో భాగస్వాములు కావాలి’
ప్రజావాణికి స్పందన కరువు
Ar Rahman | అందరినీ సంతృప్తి పరచడం సాధ్యం కాదు.. ‘రామాయణ’ విమర్శలపై ఏఆర్ రెహమాన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Rajasthan | రోడ్డు నిర్మాణ పనుల్లో కరెంట్ షాక్.. 8 మంది కార్మికులు దుర్మరణం
AP News | కుటుంబ కలహాలతో ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న తల్లీ, కొడుకు, కోడలు..!
ట్రెండింగ్ వార్తలు
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video

