Trivikram Srinivas | నువ్వు నాకు నచ్చావ్ సినిమా తర్వాత వెంకటేశ్ (Venkatesh), త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram) క్రేజీ కాంబోలో పుల్ లెంగ్త్ సినిమా రాబోతుందని తెలిసిందే. ఇటీవలే గ్రాండ్‌గా లాంచ్ అయిన ఈ మూవీ త్వరలోనె సెట్స్‌పైకి వెళ్లనుంది. అయితే కొన్నాళ్లుగా సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్లుగా రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్, ఎస్ థమన్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కానీ త్రివిక్రమ్ మాత్రం ఈ సారి రెగ్యులర్ మ్యూజిక్ కంపోజర్లు కాకుండా కాస్త రూటు మార్చబోతున్నాడట.
ఈ చిత్రం కోసం మ్యూజిక్ లవర్స్‌కు మరింత నయా ఫీల్ అందించేందుకు యానిమల్ కంపోజర్‌ను తెరపైకి తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. తాజా టాక్ ప్రకారం ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ పేరును పరిగణనలోకి తీసుకుంటున్నాడని ఫిలింనగర్ సర్కిల్ ఇన్సైడ్ టాక్. పాన్ ఇండియా మూవీ లవర్స్‌ను ఎంటర్టైన్ చేసేలా ఆల్బమ్‌ను ప్లాన్ చేస్తున్నట్టు తాజా వార్తలు హింట్ ఇచ్చేస్తున్నాయి. మరి వెంకీ కోసం హర్షవర్దన్ రామేశ్వర్ ఎలాంటి బీజీఎం, మ్యూజిక్ ఆల్బమ్ రెడీ చేశాడనేది చూడాలి.
ఈ ప్రాజెక్ట్‌లో రుక్మిణి వసంత్ ఫీ మేల్ లీడ్ రోల్లో మెరువబోతుండగా..మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. త్రివిక్రమ్ మరోవైపు అల్లు అర్జున్‌తో మైథలాజికల్ ఫిల్మ్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబోలో వచ్చే సినిమా పూర్తయిన తర్వాత త్రివిక్రమ్ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుందట.
Actor Srikanth Bharat | మహాత్మా గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టాలీవుడ్ నటుడు
The Paradise | దసరా డైరెక్టర్‌తో ‘కిల్’ రాఘవ.. నాని ది ప్యారడైజ్‌పై సూపర్ హైప్