SSMB28 Movie | టాలీవుడ్ అగ్ర దర్శకులలో త్రివిక్రమ్ ఒకడు. ఇక్కడి స్టార్ హీరోలకు సమానంగా త్రివిక్రమ్‌కు క్రేజ్ ఉంది. మాటలతో మాయ చేయగలడు, టేకింగ్, విజన్‌తో ప్రేక్షకులను ఫిదా చేయగలడు. ఇక ఈయన నుండి సినిమా వచ్చి దాదాపు రెండేళ్ళయింది. ‘అలవైకుంఠపురం’లో తర్వాత ‘SSMB28’తో త్రివిక్రమ్ మళ్ళీ మెగా ఫోన్ పట్టాడు. ఇటీవలే షూటింగ్ ప్రారంభించిన ఈ చిత్రం ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్‌ను జరుపుకుంటుంది. ఇక ఈ కాంబో అనౌన్స్ చేసినప్పటి నుండి ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. రివేంజ్ స్టోరీతో ఈ సినిమా ఉండనున్నట్లు టాక్. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ చిత్రంలో త్రివిక్రమ్ ఓ ఐటెం సాంగ్‌ను పెట్టనున్నట్లు తెలుస్తుంది. ‘అత్తారింటికి దారేది’ తర్వాత ఇప్పటి వరకు ఈయన సినిమాల్లో ఐటెం సాంగ్ పెట్టలేదు. కాగా ఈ సినిమా కోసం థమన్‌తో ఒక మాస్ ఐటెం సాంగ్‌ను రెడీ చేపిస్తున్నాడట. త్వరలోనే దీనిపై అధికారికంగా ప్రకటన వచ్చే చాన్స్ ఉంది. ఇక ఈ చిత్రంలో మహేష్‌కు జోడీగా పూజా హెగ్డే హీరోయిన్గా నటించనుంది. హారికా&హాసినీ క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధా కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఎస్.ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో ఓ కీలకపాత్ర కోసం టాలీవుడ్ టైర్2 హీరోను తీసుకోనున్నట్లు సమాచారం.
Read Also:
VT12 | ఆసక్తి రేకిత్తిస్తున్న ‘వరుణ్‌తేజ్12’ స్పెషల్ వీడియో..!
Cobra Movie | చెప్పిన తేదీ కంటే ముందుగానే ఓటీటీలో విడుదలైన ‘కోబ్రా’.. ఏ ప్లాట్‌ఫార్మ్‌లో అంటే?
Chiranjeevi | ఇందిరాదేవి మృతిపై చిరంజీవి ఎమోషనల్.. మాతృదేవత అంటూ ట్వీట్
Ponniyin Selvan-1 | ‘పొన్నియన్ సెల్వన్’ నటులకు షాకింగ్ రెమ్యునరేషన్.. ఒక్కొక్కరికి అన్ని కోట్లా?