వెంకటేష్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే లాంఛనంగా ప్రారంభోత్సవం జరుపుకున్న ఈ సినిమా తాలూకు రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ 6 నుంచి మొదలుకానుంది. ఈ సినిమా కోసం త్రివిక్రమ్ వినోదాత్మక కుటుంబ కథను సిద్ధం చేశారట. ఆయన శైలి వినోదం, వ్యంగ్యం, భావోద్వేగాల కలబోతగా ఉంటుందని చెబుతున్నారు.
వెంకటేష్ నటించిన ‘నువ్వు నాకు నచ్చావు’ ‘మల్లీశ్వరి’ చిత్రానికి త్రివిక్రమ్ మాటల రచయితగా పనిచేశారు. ఈ సినిమాల్లోని సంభాషణలు విజయంలో కీలక భూమిక పోషించాయి. దీంతో వీరిద్దరి తాజా చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు.