ఆ విషయాన్నే మర్చిపోయా!
దళపతి విజయ్‌తో సన్నిహిత సంబంధాల్ని కొనసాగిస్తూ తమిళనాట వార్తల్లో నిలుస్తున్నది అగ్ర కథానాయిక త్రిష. తాజాగా సూర్య ‘కరుప్పు’ సినిమా విషయంలో నిర్మాతలకు, త్రిషకు మధ్య రాజుకున్న వివాదం చర్చనీయాంశంగా మారింది.
దళపతి విజయ్‌తో సన్నిహిత సంబంధాల్ని కొనసాగిస్తూ తమిళనాట వార్తల్లో నిలుస్తున్నది అగ్ర కథానాయిక త్రిష. తాజాగా సూర్య ‘కరుప్పు’ సినిమా విషయంలో నిర్మాతలకు, త్రిషకు మధ్య రాజుకున్న వివాదం చర్చనీయాంశంగా మారింది. ‘కరుప్పు’ చిత్రం ఈ నెల 14న తమిళ, తెలుగు భాషల్లో విడుదలకు సిద్ధమవుతున్నది.
ఇరవైఏండ్ల విరామం తర్వాత సూర్యతో కలిసి త్రిష నటించిన చిత్రమిది కావడం విశేషం. ఈ సినిమా ప్రచార కార్యక్రమాలకు త్రిషను దూరంగా పెట్టినట్లు కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతున్నది. ఇటీవల నిర్వహించిన ఆడియో వేడుకలో కూడా త్రిష కనిపించలేదు. వేదికపై ఆమె గురించి ఎవరూ మాట్లాడలేదు. ఈ నేపథ్యంలో చిత్రబృందంపై విమర్శలొస్తున్నాయి.
తాజాగా త్రిష తాలూకు లుక్ వీడియోను శుక్రవారం రిలీజ్ చేశారు. దీనిపై త్రిష వ్యంగ్యంగా స్పందించింది. ఈ సినిమాలో తాను నటించిన విషయాన్ని మర్చిపోయానని, కనీసం ఈ వీడియోతో గుర్తుచేసినందుకు థాంక్స్ అంటూ ఎక్స్‌లో పోస్ట్ పెట్టింది. దీంతో నిర్మాతలు, త్రిష మధ్య నిజంగానే వివాదాలు తలెత్తాయని చెన్నై సినీ వర్గాల్లో వినిపిస్తున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

