‘త్రిష పాలిటిక్స్‌లో ఎంట్రీ ఇవ్వబోతుంది. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కానుంది. ఇందుకోసం తమిళనాడుకు చెందిన ఓ పెద్ద నాయకుడు ప్రయత్నాలు చేస్తున్నాడు’ అంటూ గత కొద్దిరోజులుగా తమిళనాట జోరుగా ప్రచారం జరిగింది. ప్రస్తుతం సినిమాల విషయంలో త్రిష సెలెక్టివ్‌గా ఉండటంతో ఆమె రాజకీయాల్లోకి వస్తుందేమోనని అభిమానులు కూడా ఆ వార్తల్ని నమ్మారు.
తాజాగా వీటిపై స్పష్టత నిచ్చింది త్రిష తల్లి ఉమా కృష్ణన్. తన కూతురికి రాజకీయాల మీద ఏమాత్రం ఆసక్తి లేదని, తమ కుటుంబానికి పాలిటిక్స్ అంటేనే పడవని చెప్పింది. ఇండస్ట్రీలో తన కుమార్తెకు ఇంకా భవిష్యత్తు ఉందని చెప్పుకొచ్చింది. ఈ విషయంలో త్రిష కూడా స్పందించింది. ఎలాంటి ఆధారం లేకుండా రూమర్స్ ఎందుకు వ్యాప్తి చేస్తారో అర్థం కాదని వాపోయింది.