బాలీవుడ్ లెజెండరీ హీరోయిన్ పర్వీన్ బాబీ జీవితం ఆధారంగా బాలీవుడ్లో సినిమా రానున్నది. జోయా మెహ్రా తెరకెక్కించనున్న ఈ చిత్రంలో పర్వీన్ బాబీగా త్రిప్తి డిమ్రీ కనిపించనున్నది. పర్వీన్‌బాబీ జీవితంలోని గ్లామర్, వివాదాలు, వ్యక్తిగత పోరాటాలు.. వీటన్నింటినీ సమతుల్యంచేసి, అద్భుతమైన బయోపిక్‌గా ఈ చిత్రాన్ని తెరమీదకు తీసుకురావాలనే ప్రయత్నంలో మేకర్స్ ఉన్నారు.
అయితే.. పర్వీన్‌గా త్రిప్తీని ఎంపిక చేయడంపై బాలీవుడ్లో పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గొప్పనటిగా కీర్తింపబడ్డ పర్వీన్‌బాబీ పాత్రకు త్రిప్తి న్యాయం చేయగలదా? అంటూ కొందరు బాహాటంగానే ప్రశ్నిస్తున్నారు. ఈ డిబేట్‌తో సినిమాపై మరింత హైప్ క్రియేటయింది. త్పిప్తి డిమ్రీపై మేకర్స్ మాత్రం పూర్తి నమ్మకంతో ఉన్నారు. త్వరలోనే సినిమా సెట్స్‌కి వెళ్లనుంది.