ముంబై : యానిమల్ మూవీ టీజర్, ట్రైలర్లో ఒక్క మాట మాట్లాడకుండానే కేవలం తన బాడీ ల్యాంగ్వేజ్‌తో బాబీ డియోల్ (Bobby Deol) ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. తన లుక్స్, ఎక్స్‌ప్రెషన్స్‌తో అందరి దృష్టినీ ఆకర్షించాడు. బాబీ డియోల్ అద్భుత ఫిజిక్ వెనుక ఎంతటి కష్టం ఉందో బాబీ పర్సనల్ ట్రైనర్ ప్రజ్వల్ శెట్టి వివరించాడు. ఆకట్టుకునే శరీర సౌష్టవంతో బాబీ డియోల్ కనిపించేందుకు ఎలాంటి కసరత్తులు, జాగ్రత్తలు తీసుకున్నదీ వెల్లడించాడు.
రణ్‌బీర్ కంటే బాబీ డియోల్ ధృడంగా కనిపించాలని యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కోరుకున్నారు. దీంతో నాలుగు నెలల పాటు బాబీ డియోల్ స్వీట్స్‌కు దూరంగా ఉన్నాడని ప్రజ్వల్ శెట్టి తెలిపాడు. బాబీ దేహం కండలు తీరి, విశాలంగా కనిపించాల్సి ఉందని, దీంతో అతడి శరీరంలో కొవ్వు కరిగించేందుకు కసరత్తులు చేశాడని చెప్పుకొచ్చాడు.
సల్మాన్ ఖాన్ రేస్ 3తో బాబీ డియోల్ సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభమైనప్పటి నుంచి ప్రజ్వల్ శెట్టి అతడికి శిక్షణ ఇస్తున్నాడు. బాబీ శరీరం మారిన తీరు పట్ల సందీప్ రెడ్డి సంతృప్తి వ్యక్తం చేశాడని ప్రజ్వల్ తెలిపాడు. బాబీ డియోల్ కోసం ప్రత్యేకమైన డైట్ ప్లాన్‌తో ఈ ఫీట్ సాధించామని అన్నాడు. బాబీకి స్వీట్స్ అంటే ఇష్టమున్నా నాలుగు నెలల పాటు వాటికి దూరంగా ఉన్నాడని చెప్పాడు. రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన యానిమల్‌లో బాబీ డియోల్ విలన్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ మూవీ డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.
Read More :