టోవినో థామస్, త్రిష ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళ చిత్రం ‘ఐడెంటిటీ’ తెలుగులో అదే పేరుతో ఈ నెల 24న విడుదలకానుంది. మలయాళ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించిన ఈ చిత్రాన్ని శ్రీవేదాక్షర మూవీస్ పతాకంపై చింతపల్లి రామారావు తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో నిర్మాత మాట్లాడుతూ..హత్య కేసు పరిశోధన నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారని, త్రిష పాత్ర ప్రధానాకర్షణగా నిలుస్తుందని, తెలుగు ప్రేక్షకులు మెచ్చే అన్ని అంశాలుంటాయని అన్నారు.
మర్డర్ మిస్టరీ ఛేదించే విషయంలో ఓ ఆర్టిస్టు పోలీసులకు ఏ విధంగా సహాయం చేశాడు? చివరకు హత్యా రహస్యాన్ని ఎలా ఛేదించారనే అంశాలు థ్రిల్‌ని పంచుతాయని నటుడు వినయ్‌రాయ్ తెలిపారు. వినయ్‌రాయ్, మందిరా బేడీ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: అఖిల్ జార్జ్, సంగీతం: జేక్స్ బెజోయ్, రచన-దర్శకత్వం: అఖిల్ పాల్, ఆనాస్ఖాన్.