Sankranti Box Office Report | 2026 సంక్రాంతి టాలీవుడ్‌కి అసలైన కళను తీసుకొచ్చింది. ఏకంగా ఐదు భారీ సినిమాలు ఈ సంక్రాంతికి బరిలోకి దిగడంతో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురుస్తోంది. ప్రభాస్ రేంజ్, మెగాస్టార్ మ్యాజిక్, నవీన్ పోలిశెట్టి కామెడీ, రవితేజ మార్క్ కామెడీ, శర్వనంద్ నటన ఇలా ఒక్కో సినిమా ఒక్కో రకమైన సందడిని సృష్టిస్తోంది. అయితే ఈ పండుగకి వచ్చిన సినిమాల బాక్సాఫీస్ రిపోర్ట్ ఒకసారి చూసుకుంటే.
1. ది రాజా సాబ్ (The Raja Saab)
సంక్రాంతి పండుగను ముందుగానే తీసుకువచ్చింది ది రాజా సాబ్ చిత్రం. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో వచ్చిన ఈ హారర్-కామెడీ జనవరి 09న ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ ఓపెనింగ్స్ సాధించింది. సినిమాపై మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, ప్రభాస్ క్రేజ్ వల్ల వసూళ్లలో దూసుకుపోతోంది. విడుదలైన మొదటి వారంలోనే ఈ చిత్రం ఇప్పటివరకు రూ.238 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.
2. మన శంకర వరప్రసాద్ గారు (Mana Shankara Vara Prasad Garu)
మెగాస్టార్ చిరంజీవి – అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌ను థియేటర్లకు పరుగులు తీయిస్తోంది. చిరంజీవి మార్క్ కామెడీ, డ్యాన్సులు సినిమాకు పెద్ద ప్లస్ అయ్యాయి. ఈ చిత్రం కేవలం 5 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల మార్కును దాటేసింది. ఇండియాలో కూడా సుమారు రూ.120 కోట్ల గ్రాస్ సాధించింది.
3. భర్త మహాశయులకు విజ్ఞప్తి (Bhartha Mahasayulaku Vinnapthi)
మాస్ రాజా రవితేజ తనదైన శైలిలో మరో కామెడీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ ఉన్నప్పటికీ రవితేజ ఎనర్జీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ చిత్రం మొదటి 4 రోజుల్లో సుమారు
రూ.8.60 కోట్ల నెట్ వసూళ్లను సాధించినట్లు సమాచారం.
4. అనగనగా ఒక రాజు (Anaganaga Oka Raju)
యువ హీరో నవీన్ పోలిశెట్టి మ్యాజిక్ మరోసారి పనిచేసింది. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమా యూత్ మరియు ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఫేవరెట్ అయింది. ఈ చిత్రం 3 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.42 కోట్లకు పైగా గ్రాస్ సాధించి, నవీన్ కెరీర్లో బెస్ట్ ఓపెనింగ్స్ నమోదు చేసింది.
5. నారి నారి నడుమ మురారి (Nari Nari Naduma Murari)
శర్వానంద్ హీరోగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో వచ్చిన ఈ ఫ్యామిలీ డ్రామా సైలెంట్‌గా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాలో కామెడీ వర్కవుట్ అవ్వడంతో మౌత్ టాక్‌తో ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. మరోవైపు ఈ చిత్రం 3 రోజుల్లో సుమారు రూ.5.8 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. తక్కువ థియేటర్లలో విడుదలైనప్పటికీ కలెక్షన్ల శాతం పెరుగుతుండటం విశేషం. ఇక మొత్తానికి 2026 సంక్రాంతి టాలీవుడ్ చరిత్రలో ఒక అరుదైన బాక్సాఫీస్ వార్‌గా నిలిచిపోయింది. థియేటర్ల కొరత ఉన్నప్పటికీ, కంటెంట్ ఉన్న సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.