Ugram Movie | ఉగ్రం సినిమా కోసం టాలీవుడ్ యంగ్ హీరోల వెరైటీ ప్రమోషన్లు..!
Ugram Movie Promotions | రాజేంద్ర ప్రసాద్ తర్వాత ఆ స్థాయిలో కామెడీ సినిమాలు చేసిన ఘనత అల్లరి నరేష్‌కే దక్కింది. ఏడాదికి రెండు, మూడు సినిమాలు రిలీజ్ చేస్తూ క్షణం తీరిక లేకుండా గడిపేవాడు. అయితే గతకొంత కాలంగా నరేష్ సినిమాలు ప్రేక్షకులకు బోర్ కొట్టేశాయి.
Ugram Movie Promotions | రాజేంద్ర ప్రసాద్ తర్వాత ఆ స్థాయిలో కామెడీ సినిమాలు చేసిన ఘనత అల్లరి నరేష్‌కే దక్కింది. ఏడాదికి రెండు, మూడు సినిమాలు రిలీజ్ చేస్తూ క్షణం తీరిక లేకుండా గడిపేవాడు. అయితే గతకొంత కాలంగా నరేష్ సినిమాలు ప్రేక్షకులకు బోర్ కొట్టేశాయి. ముఖ్యంగా జబర్దస్త్ వంటి షోలు రావడంతో నరేష్ కామెడీని ప్రేక్షకులు అంతగా పట్టించుకోవడం లేదు. దాంతో అల్లరోడు తనను తాను కొత్తగా ఆవిష్కరిస్తూ రెండేళ్ల క్రితం ‘నాంది’తో యాక్షన్ మోడ్‌లోకి వచ్చేశాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కోట్లు కొల్లగొట్టింది. నరేష్‌కు తిరుగులేని గుర్తింపును, మార్కెట్‌ను తెచ్చిపెట్టింది. ఇక దర్శకుడిగా తొలి అడుగులోనే విజయ్ కనకమేడల విజయం సాధించాడు.
మళ్లీ రెండేళ్లకు అల్లరి నరేష్ ఆ దర్శకుడితోనే చేతులు కలిపి ‘ఉగ్రం’ సినిమా చేశాడు. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్లు సినిమాపై ఎక్కడలేని అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమా మే 5న రిలీజ్ కాబోతుంది. దాంతో చిత్రబృందం వరుస ప్రమోషన్లతో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇక తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను కూడా గ్రాండ్‌గా జరిపారు. ఈ వేడుకకు టాలీవుడ్ యంగ్ హీరోలు విశ్వక్ సేన్, అడివిశేష్, సందీప్ కిషన్, నిఖిల్ గెస్ట్లుగా వచ్చారు. కాగా ఈ యంగ్ హీరోలు ఉగ్రం మూవీ ప్రమోషన్లు వినూత్నంగా జరిపారు. ట్రెండింగ్‌లో ఉన్న మీమ్స్ వీడియోలను రీ క్రియేట్ చేశారు. నాంది తర్వాత నరేష్ స్క్రిప్ట్‌లలో ఎలాంటి మార్పులు వచ్చాయి అనే దాని మీద ఫన్నీ వీడియోలను చేశారు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
Thank you my boys 🤗 @AdiviSesh @sundeepkishan @VishwakSenActor @actor_Nikhil for giving me such a fun surprise last night at #Ugram ‘s pre-release event. Reminded me of the good old “audio function” days. pic.twitter.com/vbVf1hFBbH
— Allari Naresh (@allarinaresh) May 2, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

