ఆదివారం 17 జనవరి 2021
Cinema - Nov 28, 2020 , 16:05:26

క‌మ‌ల్ హాస‌న్ మిష‌న్ మార్చ్‌..!

క‌మ‌ల్ హాస‌న్ మిష‌న్ మార్చ్‌..!

స్టార్ హీరో క‌మ‌ల్‌హాస‌న్ చేతిలో ప్ర‌స్తుతం రెండు ప్ర‌తిష్టాత్మ‌క ప్రాజెక్టులున్న విష‌యం తెలిసిందే. శంక‌ర్ డైరెక్ష‌న్ లో భార‌తీయుడు 2 ఇప్ప‌టికే సెట్స్‌పైకి వెళ్ల‌గా..క్రేన్ కుప్ప‌కూల‌డంతో షూటింగ్ నిలిచిపోయింది. మ‌రోవైపు లాక్ డౌన్ రావ‌డంతో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అప్ డేట్స్ లేకుండా పోయాయి. ఇదిలా ఉంటే రీసెంట్ గా కోలీవుడ్ డైరెక్ట‌ర్ లోకేశ్ క‌న‌క‌రాజ్ తో విక్ర‌మ్ సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు క‌మ‌ల్‌. తాజా స‌మాచారం ప్ర‌కారం క‌మ‌ల్ హాస‌న్ మిష‌న్ మార్చ్ ను అమ‌లు చేయాల‌ని ఫిక్స్ అయ్యాడ‌ట‌. అంటే వ‌చ్చే ఏడాది మార్చి లోగా భార‌తీయుడు 2, విక్ర‌మ్ ప్రాజెక్టుల‌ను పూర్తి చేయాలని భావిస్త‌న్నాడ‌ట‌.

క‌మ‌ల్‌ ఇదే విష‌యాన్ని డైరెక్ట‌ర్లు శంక‌ర్‌, లోకేశ్ కు కూడా చెప్పిన‌ట్టు టాక్ వినిపిస్తోంది. డిసెంబ‌ర్ లో విక్ర‌మ్ సెట్స్ పైకి వెళ్ల‌నుండ‌గా త్వ‌ర‌లోనే ఈ సినిమాను పూర్తి చేసే అవ‌కాశాలున్నాయి. అయితే భారీ బ‌డ్జెట్ చిత్ర‌మైన భార‌తీయుడు 2పైనే అనుమానాలు నెల‌కొన్నాయి. కేవ‌లం నాలుగు నెల‌ల కాలంలో రెండు ప్రాజెక్టుల‌ను ఎలా పూర్తి చేస్తాడ‌ని చ‌ర్చించుకుంటున్నారు అభిమానులు. మార్చి త‌ర్వాత క‌మ‌ల్ హాస‌న్ త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎంఎన్ఎం పార్టీ నుంచి ఎన్నిక‌ల క్యాంపెయిన్ మొద‌లుపెట్టేందుకు స‌న్నాహాలు చేసుకుంటున్న‌ట్టు తెలుస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.