ప్రముఖ టాలీవుడ్ (Tollywood) సీనియర్ డైరెక్టర్ శరత్ (Sarath) కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు. శరత్ అంత్యక్రియలు రేపు మహాప్రస్థానంలో నిర్వహించనున్నట్టు ఆయన కుటుంబసభ్యులు తెలియజేశారు. చాదస్తపు మొగుడు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యారు శరత్. ఆయన తెలుగులో బాలకృష్ణతో తీసిన వంశానికొక్కడు, పెద్దన్నయ్య, సుల్తాన్, వంశోద్దారకుడు చిత్రాలు మంచి హిట్లుగా నిలిచాయి.
సుమన్‌తో చిన్నల్లుడు, సూపర్ హిట్ బ్లాక్ బాస్టర్ గా నిలిచిన బావ బావ మరిది (bava bava maridi), చాదస్తపు మొగుడు, పెద్దింటి అల్లుడు సినిమాలు చేశారు. శరత్ తెలుగులో 20 సినిమాలకు దర్శకత్వం వహించారు. శరత్ మరణంతో సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు ప్రగాడ సంతాపాన్ని తెలియజేశారు. శరత్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని ప్రార్థించారు.