AK64 | కోలీవుడ్ స్టార్ యాక్టర్ అజిత్‌కుమార్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కాగా అజిత్ కుమార్ కొత్త సినిమా అప్డేట్స్ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్న అభిమానుల కోసం ఆసక్తికర వార్త ఒకటి బయటకు వచ్చింది. ఈ స్టార్ యాక్టర్ ఏకే 64(AK64) సినిమాను లైన్లో పెట్టాడని తెలిసిందే. మార్క్ ఆంటోనీ ఫేం అధిక్ రవిచంద్రన్ డైరెక్ట్ చేస్తున్నఈ మూవీని టాలీవుడ్ టాప్ బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుందని వార్తలు వచ్చినా అధికారికంగా ఎలాంటి సమాచారం బయటకు రాలేదు.
ఈ చిత్రాన్ని ప్రముఖ టాలీవుడ్ నిర్మాత టేకోవర్ చేయబోతున్నాడని తాజా న్యూస్ ఒకటి టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఇటీవలే నారి నారి నడుమ మురారి సినిమాతో హిట్టందుకున్నఅనిల్ సుంకర హోం బ్యానర్ ఏకే ఎంటర్టైన్మెంట్స్పై ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడని.. దీనిపై అధికారిక ప్రకటన ఒకటే పెండింగ్‌లో ఉందని ఇన్సైడ్ టాక్. ఈ చిత్రం షూటింగ్ ఇదే నెలలో మొదలుకానుంది. ఏకే 64 పక్కా ఫ్యామిలీ ఆడియెన్స్ కోసం తెరకెక్కిస్తున్న సినిమా అధిక్ రవిచంద్రన్ ఇప్పటికే క్లారిటీ కూడా ఇచ్చేశాడు. ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.
ఈ చిత్రంలో పాపులర్ అందాల భామలు పూజా హెగ్డే, నయనతారను ఫీ మేల్ లీడ్ రోల్స్ కోసం పరిశీలిస్తున్నట్టు ఇండస్ట్రీ సర్కిల్లో వార్తలు రౌండప్ చేస్తున్నాయి. దీనిమై మేకర్స్ నుంచి ఏదైనా ప్రకటన బయటకు వస్తుందేమో చూడాలి మరి. గుడ్ బ్యాడ్ అగ్లీ, విదాముయార్చి సినిమాల తర్వాత అజిత్‌కుమార్ నుంచి రాబోతున్న ప్రాజెక్ట్ కావడంతో ఏకే 64పై అంచనాలు భారీగానే ఉన్నాయి.