Varun Tej | వరుణ్ తేజ్ కెరీర్‌కు కీలక మలుపు .. అట్లీ కాంబో వార్తలతో పెరిగిన హైప్
Varun Tej | మెగా బ్రదర్ నాగబాబు వారసుడిగా ‘ముకుంద’ సినిమాతో టాలీవుడ్లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆ తరువాత కూడా మాస్ మూసలో ఇరుక్కుపోకుండా విభిన్న కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను నిర్మించుకున్నాడు.
Varun Tej | మెగా బ్రదర్ నాగబాబు వారసుడిగా ‘ముకుంద’ సినిమాతో టాలీవుడ్లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆ తరువాత కూడా మాస్ మూసలో ఇరుక్కుపోకుండా విభిన్న కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను నిర్మించుకున్నాడు. కమర్షియల్ సినిమాలతో పాటు ప్రయోగాత్మక కథలను స్వీకరించడం ద్వారా యువ హీరోల్లో తనదైన స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు. అయితే గత కొంతకాలంగా వరుస పరాజయాలు ఎదురవ్వడంతో వరుణ్ తేజ్ కెరీర్‌పై ఒత్తిడి పెరిగిందనే అభిప్రాయాలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. మార్కెట్, ఇమేజ్ పరంగా కూడా కొంత ప్రభావం పడిందనే టాక్ నడుస్తోంది.
ఇలాంటి పరిస్థితుల్లోనే మళ్లీ సక్సెస్ ట్రాక్‌లోకి రావాలనే సంకల్పంతో వరుణ్ తేజ్ తన తదుపరి ప్రాజెక్ట్‌ల ఎంపికలో మరింత జాగ్రత్తగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. కెరీర్‌ను మలుపుతిప్పే బలమైన హిట్ కోసం ఆచితూచి కథలను పరిశీలిస్తున్నాడని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా వినిపిస్తున్న ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కోలీవుడ్ స్టార్ దర్శకుడు అట్లీతో వరుణ్ తేజ్ సినిమా చేయబోతున్నారనే ప్రచారం అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది. ‘జవాన్’ వంటి భారీ బ్లాక్‌బస్టర్‌తో బాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన అట్లీ ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో ఓ భారీ ప్రాజెక్ట్‌పై పనిచేస్తున్నాడు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం హాలీవుడ్ స్థాయి విజువల్స్‌తో తెరకెక్కుతోందనే టాక్ ఇప్పటికే ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.
ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత వరుణ్ తేజ్‌తో సినిమా చేయాలని అట్లీ ఆలోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వరుణ్ కోసం ఇప్పటికే ఓ పవర్ఫుల్ కమర్షియల్ యాక్షన్ కథ సిద్ధం చేశారనే ప్రచారం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఈ కాంబినేషన్ నిజమైతే వరుణ్ తేజ్ కెరీర్లో ఇదే బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ అవుతుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అధికారిక ప్రకటన రాకపోయినా ఈ వార్త వరుణ్ మార్కెట్‌పై మళ్లీ పాజిటివ్ బజ్ తీసుకొచ్చిందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇదిలా ఉండగా వరుణ్ తేజ్ ప్రస్తుతం మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘కొరియన్ కనకరాజు’ చిత్రంలో నటిస్తున్నాడు. హారర్ కామెడీ జానర్లో, కొరియన్ టచ్‌తో రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికే టైటిల్ గ్లింప్స్‌తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cancer Treatment | క్యాన్సర్ చికిత్స తీసుకునే రోగుల్లో గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
Drinking Water | సంగారెడ్డి పట్టణంలో తాగునీటి కష్టాలు చూశారా..?
MP Gurumurthy | స్థానిక సంస్థల ఎన్నికలలో అక్రమాలపై నిష్పక్షపాత విచారణ జరిపించాలి : ఎంపీ గురుమూర్తి
‘సర్వభ్రష్ట ప్రభుత్వాన్ని మార్చేందుకు ప్రజలు సన్నద్ధం’
Srinidhi Shetty | బ్లాస్ట్ సినిమాతో ఎలాంటి కనెక్షన్ లేదు.. ‘ఆదర్శకుటుంబం’ హీరోయిన్ శ్రీనిధి శెట్టి
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

