BellamKonda Srinivas | సినీ పరిశ్రమ సక్సెస్ చుట్టే తిరుగుతుంది. సక్సెస్ వుంటేనే ఇక్కడ వాల్యూ.. లేకపోతే ఎవరూ పట్టించుకోలేరు. అయితే కొంత మంది వాళ్ల నేపథ్యం కారణంగా విజయం వున్నా లేకపోయినా సినిమాలు మాత్రం చేస్తూనే వుంటారు. ఆ కోవలోకి చెందిన హీరోలే బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్.
ఇప్పుడు ఈ ముగ్గురు హీరోలకు విజయం చాలా అవసరం. అల్లుడు శ్రీను, అల్లుడు అదుర్స్, రాక్షసుడు వంటి చిత్రాలతో కథానాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్. ఇటీవల ఛత్రపతి రీమేక్‌తో హిందీలో కూడా ఎంట్రీ ఇచ్చాడు. వరుసగా యాక్షన్ సినిమాలు చేస్తున్న ఈ కథానాయకుడు హిందీ చిత్ర సీమలో కూడా గుర్తింపు వుంది.
ఇక నారా రోహిత్ చాలా కాలం విరామం తర్వాత ఇటీవలే ప్రతినిధి-2 చిత్రంతో పలకరించాడు. పొలిటికల్ నేపథ్యంలో రూపొందిన ఆ సినిమా ఫ్లాప్ కావడంతో రోహిత్ మళ్లీ కథలపై దృష్టి పెట్టాడు. ఇక గత కొంతకాలంగా సినిమాలకే బ్రేక్ ఇచ్చిన మనోజ్ ఇటీవలే మళ్లీ సినిమాలతో బిజీ కావాలని కోరుకున్నాడు. అందుకు తగ్గట్టే ఆయన నటిస్తున్న రెండు సినిమాలు కూడా సెట్స్ మీద వున్నాయి. ఇక ప్రస్తుతం బెల్లకొండ శ్రీనివాస్ నటిస్తున్న రెండు చిత్రాలు సెట్స్ మీద వున్నాయి.
అయితే ఈ ముగ్గురు త్వరలోనే ఓ సినిమాలో కనిపించబోతున్నారు. ముగ్గురు కలిసి నటించబోతున్నారు. ఈ ముగ్గురు నటిస్తున్న ఈ మల్టీస్టారర్ చిత్రానికి అల్లరి నరేష్‌తో నాంది చిత్రాన్ని తెరకెక్కించిన విజయ్ కనకమేడల దర్శకుడు. సత్య సాయి ఆర్ట్స్ పతాకంపై కె..కె.రాధామోహన్ నిర్మించనున్న ఈ చిత్రం ఆగస్టు 19న లాంఛనంగా ప్రారంభం కానుంది. అయితే ఈ చిత్రంలో నారా రోహిత్, మంచు మనోజ్‌లు నెగెటివ్ రోల్స్‌లో కనిపిస్తారని తెలిసింది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా తెలియజేస్తారు.
Also Read..