హైదరాబాద్: ఒకే విడతలో రూ.2 లక్షల రుణమాఫీపై ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారని, నిలదిస్తే బెదిరిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తంచేశారు. అయినా తగ్గేదే లేదని నిగ్గదీసి అడుగుతామని, నిజాలే చెబుతామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ డొల్ల మాటల గుట్టు విప్పుతూనే ఉంటామన్నారు. రైతు రుణాలు రూ.49,500 కోట్లు ఉన్నాయని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (SLBC) తెలిపిందని, రాష్ట్రం మంత్రివర్గ భేటీలో రూ.31 వేల కోట్ల రుణాలను మాఫీ చేస్తున్నట్లు చెప్పారన్నారు. అయితే బడ్జెట్లో కేటాయించింది మాత్రం రూ.26 కోట్లేనన్నారు. మూడు విడుతల్లో ఇచ్చింది రూ.17,933 కోట్లు మాత్రమేనని విమర్శించారు. అయినా రుణం తీరలే.. రైతు బతుకు మారలేదని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
‘రుణం తీరలే… రైతు బతుకు మారలే. స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ (ఎస్ఎల్బీసీ) లెక్క రూ.49,500 కోట్లు. కేబినెట్ భేటీలో చెప్పింది రూ.31 వేల కోట్లు. బడ్జెట్లో కేటాయించింది రూ.26 వేల కోట్లు. 3 విడతల వారీగా కలిపి ఇచ్చింది రూ.17933 కోట్లు. ఒకే విడతలో రెండు లక్షల రైతు రుణమాఫీపై ప్రశ్నిస్తే దాడులు.. నిలదీస్తే బెదిరింపులు. అయినా తగ్గేదే లేదు. నిగ్గదీసి అడుగుతాం.. నిజాలే చెపుతాం. కాంగ్రెస్ డొల్ల మాటల గుట్టు విప్పుతూనే ఉంటాం. జై కిసాన్, జై తెలంగాణ’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
రుణం తీరలే… ! రైతు బతుకు మారలే.. !
✳️ స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ (ఎస్ఎల్బీసీ) లెక్క రూ. 49,500 కోట్లు
✳️ కేబినెట్ భేటీలో చెప్పింది రూ. 31 వేల కోట్లు
✳️ బడ్జెట్లో కేటాయించింది రూ. 26 వేల కోట్లు
❌ 3 విడతల వారీగా కలిపి ఇచ్చింది రూ. 17933 కోట్లు
ఒకే విడతలో రెండు లక్షల… pic.twitter.com/4QXmif3mE2
— KTR (@KTRBRS) August 17, 2024