టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరోయిన్ సమంత (Samantha)కు హీరో కావాలట…అవును మీరు విన్నది నిజమే. సమంత దసరా సందర్భంగా యాక్షన్ థ్రిల్లర్ జోనర్ లో ఓ సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే. హీరోయిన్ ఓరియెంటెడ్ కథాంశంతో అవుట్ అండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రం రాబోతుంది. శ్రీదేవి మూవీస్ బ్యానర్ (Sridevi Movies)పై దర్శకద్వయం (ఇద్దరు దర్శకులు) ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారని సమాచారం.
తమ కొత్త చిత్రంలో మేల్ లీడ్ కోసం యువ హీరో కావాలని సమంత అండ్ మేకర్స్ చూస్తున్నారట. కథ ప్రకారం హీరోగా యువ నటుడు అయితే బాగుంటుందని భావించిన దర్శకనిర్మాతలు..ఆ నటుడి కోసం వేటలో పడ్డారని ఫిలింనగర్ సర్కిల్ టాక్. ఇప్పటికే పలువురు యువ నటులను కూడా సంప్రదించారని తెలుస్తోంది. కొత్త ముఖాలు కాకుండా అందరికీ తెలిసిన హీరోనే ఈ సినిమాలో తీసుకునేందుకు రెడీ అవుతున్నారట. ఈ చిత్రం వచ్చే నెల నుంచి రెగ్యులర్ చిత్రీకరణ మొదలుపెట్టనుంది.
నాగచైతన్య నుంచి విడిపోయిన తర్వాత సమంత చేస్తున్న తొలి సినిమా ఇదే. సాధారణంగా మహిళా ప్రధాన చిత్రాల్లో నటించేందుకు తెలుగు హీరోలు సిద్దంగా ఉండరు. మరి ఈ సారి సామ్‌తో కలిసి సిల్వర్ స్క్రీన్ పై మెరిసేదెవరో తెలియాలంటే మరికొంత కాలం వెయిట్ చేయాల్సిందే.
ఇది కూడా చూడండి
చాలా విషయాల్లో బైలాస్ మారుస్తాం: మంచు విష్ణు
Jacqueline Fernandez | నాలుగోసారీ ఈడీ విచారణకు డుమ్మా కొట్టిన బాలీవుడ్ నటి
Akhil Akkineni | గత పదేళ్ల నుంచి తనకిష్టమైన ఫొటో చూపించిన అఖిల్