Harish Shankar | నేనేదైనా చెబితే బాధ్యతగా ఉంటా.. కానీ వాళ్లు అలా ఉండరు : ట్రోలర్స్‌పై హరీష్ శంకర్
harish shankar | ట్రోలర్స్ అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ పలు కామెంట్స్ పెడుతున్నారు. ప్రమోషన్స్‌లో భాగంగా అభిమానులు, మూవీ లవర్స్‌తో చిట్ చాట్ చేస్తున్న డైరెక్టర్ హరీష్ శంకర్ ట్రోలర్స్‌కు తనదైన స్టైల్లో కౌంటర్ ఇచ్చాడు.
Harish Shankar | హరీష్ శంకర్ డైరెక్షన్లో పవన్ కల్యాణ్ టైటిల్ రోల్లో నటించిన చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం మిక్స్డ్ రెస్పాన్స్‌తో స్క్రీనింగ్ అవుతోంది. బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడంతో ట్రోలర్స్ అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ పలు కామెంట్స్ పెడుతున్నారు. ప్రమోషన్స్‌లో భాగంగా అభిమానులు, మూవీ లవర్స్‌తో చిట్ చాట్ చేస్తున్న డైరెక్టర్ హరీష్ శంకర్ ట్రోలర్స్‌కు తనదైన స్టైల్లో కౌంటర్ ఇచ్చాడు.
ఆన్లైన్లో ట్రోలింగ్‌ను ఎలా హ్యాండిల్ చేస్తారన్న ప్రశ్నకు హరీష్ శంకర్ స్పందిస్తూ.. ట్రోలర్స్‌ను నేనంత సీరియస్‌గా తీసుకోను. ఎందుకంటే వాళ్లు తమ ఐడెంటిటీని కానీ ఇతర విషయాలను గాని బయటకు చెప్పే ధైర్యముండదు. నేనేదైనా చెబితే జవాబుదారిగా, బాధ్యతగా ఉంటా. కానీ వాళ్లు అలా ఉండరు. ఒకవేళ వారిని నేను సీరియస్‌గా తీసుకుంటే ఇప్పటికిప్పుడే నేను సోషల్ మీడియా నుంచి తప్పుకుంటా. ట్రోలర్లు కలెక్షన్లతోపాటు భిన్నమైన విషయాల గురించి మాట్లాడుతుంటారన్నాడు.
నేను డైరెక్టర్ అవ్వాలనుకుంటున్న ప్లాన్ గురించి వారికి చెప్పినప్పుడు నన్ను ట్రోల్ చేసిన మొదటి వ్యక్తులు నా తల్లిదండ్రులు. ఎవరైనా ఎప్పుడైనా హద్దులు దాటితే, అభ్యంతరకర భాష వాడితే వారిని బ్లాక్ చేయడమే కాదు.. లీగల్ యాక్షన్ తీసుకుంటా. అనేక అడ్డంకులు, అనుకోని ముందస్తు విడుదల వంటివి ఎదురైనప్పటికీ సినిమాను సమయానికి థియేటర్లకు తీసుకురావడమే నా పెద్ద విజయం. సినిమా ఫలితాల పట్ల నేను పూర్తిగా సంతృప్తిగా ఉన్నాను.. జనాలు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రాన్ని ఎంతో ఇష్టపడుతున్నారని చెప్పుకొచ్చాడు హరీష్ శంకర్.
Read Also :
Talasani Srinivas Yadav | నగరంలో ఒక్క ఇంటినైనా నిర్మించారా ? అసెంబ్లీలో కాంగ్రెస్‌ను నిలదీసిన తలసాని
Fuel Shortage | తెలంగాణలో ఇంధన కొరత అవాస్తవం : పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్
Oka Roju | జపాన్ మంచులో సాయిపల్లవి ప్రేమకథ.. తెలుగులో ‘ఒక రోజు’గా ఏక్ దిన్!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karepalli | కారేపల్లిలో పంతుళ్ల కొరత.. ఇంట్లో పూజలకూ దొరకని పురోహితులు!
YS Sharmila | వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్.. కేసరపల్లి నివాసంలో నిర్బంధం..!
Sircilla | నేరెళ్ల గురుకుల పాఠశాల వద్ద ఆర్టీసీ బస్సు–డీసీఎం ఢీ.. డీసీఎం డ్రైవర్‌కు గాయాలు
Gautam Gambhir: ప్రమాదంలో బౌలర్ల కెరీర్: గౌతం గంభీర్
YS Jagan | చంద్రబాబు గారూ ఇప్పటికైనా బీసీలకు క్షమాపణ చెప్పండి.. వైఎస్ జగన్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

