యాక్షన్ హీరో గోపీచంద్ (Gopichand) నటిస్తోన్న తాజా చిత్రం సీటీమార్ (Seetimaarr). సంపత్ నంది (Sampath Nandi) డైరెక్షన్ లో కబడ్డీ క్రీడ నేపథ్యంలో తెరకెక్కుతుందీ చిత్రం. తమన్నా బాటియా (Tamannaah Batia) ఫీమేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. ఏప్రిల్‌లోనే విడుదల కావాల్సిన ఈ చిత్రం సెకండ్ వేవ్ కారణంగా నిలిచిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు కోవిడ్ ఫ్రభావం నుంచి ఇప్పుడిపుడే బయటకు వస్తున్నాయి.
ఇటీవలే విడుదలైన సినిమాలతో థ్రియాట్రికల్ బిజినెస్ సాధారణ స్థితికి రావడంతో మేకర్స్ సీటీమార్ చిత్ర విడుదల తేదీని ఫైనల్ చేశారు. సెప్టెంబర్ 3న సీటీమార్ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. గోపీచంద్ ఈ చిత్రంలో ఆంధ్రా మహిళల కబడ్డీ టీం కోచ్ గా నటిస్తుండగా..తెలంగాణ మహిళల కబడ్డీ టీం కోచ్ గా తమన్నా కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ కు మంచి స్పందన వస్తోన్న విషయం తెలిసిందే.
మాస్ యాంగిల్ లో సాగే జ్వాలా రెడ్డి పాటకు మూవీ లవర్స్ బ్రహ్మరథం పడుతున్నారు. మరోవైపు సీటీమార్ టైటిల్ ట్రాక్ కు కూడా అద్బుతమైన స్పందన వస్తోంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Much Awaited #Seetimaarr to hit theatres on Sept 3rd@YoursGopichand @IamSampathNandi@tamannaahspeaks @srinivasaaoffl @bhumikachawlat @SS_Screens @DiganganaS #Manisharma @adityamusic#SeetimaarrOnSept3 pic.twitter.com/OezCZJXqPB
— BA Raju's Team (@baraju_SuperHit) August 24, 2021
ఇవికూడా చదవండి..
Chiranjeevi |ముఠామేస్త్రి స్టైల్ లో చిరంజీవి..షేర్ చేసిన బాబీ
Bandla Ganesh | ఇంట్రెస్టింగ్ అప్డేట్..హీరోగా బండ్లగణేశ్..!
Raashi Khanna | రాశీఖన్నాకు మారుతి ఆశీర్వచనాలు..ట్రెండింగ్ లో స్టిల్
Sunitha | డబ్బు కోసం రామ్‌ను పెళ్లి చేసుకున్నానంటున్నారు..!