4 రోజులు.. 3 మరణాలు.. దేవుడా ఇండస్ట్రీపై ఎందుకింత పగ..?

Sirivennela | తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు అందరు ఇప్పుడు ఇదే అనుకుంటున్నారు. ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో ఎవరికీ అర్థం కావడం లేదు. పొద్దున లేసి పేపర్ చూస్తే ఏ బ్రేకింగ్ న్యూస్ కనిపిస్తుందో అని వాళ్లు వణికిపోతున్నారు. మరీ ముఖ్యంగా నవంబర్ చివరి వారం ఇండస్ట్రీకి అస్సలు కలిసి రాలేదు. 4 వరుస రోజుల్లో ముగ్గురు ప్రముఖుల మరణాలు తెలుగు ఇండస్ట్రీని విషాదంలో ముంచేశాయి. నవంబర్ 30న ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్ను మూశారు. 66 సంవత్సరాల సిరివెన్నెల గత వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నారు. పరిస్థితి విషమించడంతో ఆయన నవంబర్ 30 సాయంత్రం మరణించారు. ఈయన మరణం తెలుగు సాహితీలోకానికి తీరని లోటు ప్రతి ఒక్కరు కన్నీటిపర్యంతమయ్యారు.
ఇదిలా ఉంటే ఆయన కంటే ఒకరోజు ముందు సీనియర్ దర్శకుడు కేఎస్ నాగేశ్వరరావు ఫిట్స్ కారణంగా మరణించారు. ఆయన అత్తగారి ఊరు నుంచి హైదరాబాద్ వస్తున్న సమయంలో మధ్యలో ఫిట్స్ వచ్చింది. మూడు నాలుగు హాస్పిటల్స్ కు తరలించిన కూడా ఫలితం లేకుండా పోయింది. శ్రీహరి హీరోగా నటించిన తొలి సినిమా పోలీస్ దర్శకుడు ఈయన. తర్వాత సాంబయ్య, శ్రీశైలం లాంటి సినిమాలు తెరకెక్కించారు కేఎస్ నాగేశ్వరావు.
మరోవైపు లెజెండరీ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టారు కూడా నవంబర్ చివరి వారం కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా కరోనా వైరస్ తో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని ఒక ప్రముఖ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటూ మరణించారు. 800 సినిమాలకు పైగా కొరియోగ్రఫీ చేసిన ఆయన ఒక నేషనల్ అవార్డుతో పాటు నాలుగు తమిళనాడు స్టేట్ అవార్డులు కూడా సొంతం చేసుకున్నారు. ఈ ముగ్గురు సినీ ప్రముఖులు కేవలం నాలుగు రోజుల వ్యవధిలో మరణించడం ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇకనైనా ఈ మరణ మృదంగం ఆగితే బాగుంటుంది అని ఆ దేవుడిని వేడుకుంటున్నారు తెలుగు సినిమా ప్రముఖులు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
rivennela Last wish | చివరి వరకు సిరివెన్నెలకు ఆ ఒక్క కోరిక అలాగే మిగిలిపోయింది..
sirivennela | సిరివెన్నెల నటించిన ఒకే ఒక్క సినిమా ఏంటో తెలుసా..?
సిరివెన్నెల సీతారామశాస్త్రికి అవార్డులు తీసుకొచ్చిన పాటలు ఇవే..
సిరివెన్నెల, త్రివిక్రమ్ శ్రీనివాస్ మధ్య ఉన్న బంధుత్వం ఏంటో తెలుసా?
sirivennela songs | అలాంటి పాటలను రాయలేను : సిరివెన్నెల
Sirivennela | సిరివెన్నెలకు ఆ పేరెలా వచ్చిందో తెలుసా?
నా పాటల్లో ఎప్పుడూ నేను కనిపించొద్దు.. సిరివెన్నెల కోరిక ఎప్పుడూ అదే
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

