జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో మంగళవారం టూరిస్టులపై ఉగ్రవాదులు జరిపిన పాశవిక దాడి యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రకృతి అందాల నడుమ సేద తీరుతున్న అమాయక పర్యాటకులను నిర్దాక్షిణ్యంగా పొట్టనపెట్టుకున్న తీరు అందరి హృదయాల్ని కలచివేసింది. ఈ అమానవీయ దాడి ఘటనపై సినీ ప్రముఖులు స్పందించారు. ముష్కరుల దాడిలో అసువులు బాసిన వారికి సోషల్‌మీడియా వేదికగా సంతాపం తెలిపారు. ఇది అత్యంత క్రూరమైన చర్య అని, తీవ్రవాదులకు తగిన బుద్ధి చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
28 మంది అమాయకులను బలిగొన్న ఈ దాడి హృదయ విదారకరమైనది. క్షమించరాని క్రూరమైన చర్య. మరణించిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా
‘ఇది చీకటి రోజు. పహల్గాం ఘటన కలచివేస్తున్నది. ఇలాంటి క్రూరత్వానికి వ్యతిరేకంగా పోరాడే శక్తి మనందరికి లభిస్తుందని ఆశిస్తున్నా. ఈ విషాదం నుంచి మృతుల కుటుంబాలు బయటపడాలని దేవున్ని ప్రార్థిస్తున్నా’
బాధితులను తలచుకుంటే నా హృదయం బరువెక్కుతున్నది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఆ కుటుంబాలకు న్యాయం జరగాలని, శాంతి కోసం ప్రార్థిస్తున్నా
మాటల్లో చెప్పలేని విషాద ఘటన ఇది. మృతుల కు టుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. దేశం మొత్తం ఒక్కతాటిపై నిలిచి ఇలాంటి అమానవీయ చర్యలపై పోరాటం చేయాలి.
ఈ భువిపై స్వర్గం వంటి అందమైన కశ్మీర్‌ను ముష్కరులు నరకంగా మార్చారు. అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకోవడం పిరికిపందల చర్య. మృతుల కుటుంబాలకు నా సానుభూతి. ఒక్క అమాయకుడి ప్రాణాలు బలిగొనడం అంటే ఈ విశ్వం మొత్తాన్ని ధ్వంసం చేసినట్లే
పహల్గాం ఎంతో అందమైన ప్రదేశం. ఈ దాడి గురించి తెలిసి నా హృదయం ముక్కలైంది. బాధిత కుటుంబాలకు నా సానుభూతి తెలియజేస్తున్నా. మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా
రెండేళ్ల క్రితం నా పుట్టిన రోజును పహల్గాంలో జరుపుకున్నా. ఓ సినిమా షూటింగ్ కోసం అక్కడకు వెళ్లా. నిన్న జరిగిన దాడి ఘటన తెలుసుకొని నా హృదయం వికలమైంది. సైనిక దుస్తుల్లో వచ్చి కాల్పులు జరపడం సిగ్గుచేటు. భారతదేశం ఉగ్రవాదానికి ఎన్నటికీ తలవంచదు. ఇలాంటి పిరికివాళ్లను త్వరలో అంతమొందిస్తారని ఆశిస్తున్నా.
వీరితో పాటు పలువురు టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు పహల్గాం దాడి ఘటనను ఖండించారు. కమల్‌హాసన్, సంజయ్‌దత్, అక్షయ్‌కుమార్, మమ్ముట్టి, హృతిక్‌రోషన్ జాన్వీకపూర్, సోనూసూద్, ప్రియాంకచోప్రా, కంగనారనౌత్, అలియాభట్ తదితరులు తమ సోషల్‌మీడియా ఖాతాల ద్వారా మృతుల కుటుంబాలను సానుభూతిని తెలిపారు. పహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది.